Magavaanido nimta maarugomduraa

మగవానితో నింత మారుకొందురా
Language

(॥పల్లవి॥)
మగవానితో నింత మారుకొందురా
తగవులేలడిగేవే తతిగొని నీవు

(॥॥)
గొప్పలైననీచన్నులు కోరి పిసికెనంటా
తప్పులేల యెంచెవే సందడిఁ బతిని
ముప్పిరిగా లచ్చెనలు మోవిమీఁద నున్నవంటా
చొప్పులేల యెత్తేవే సోదించి నీవు

(॥॥)
చెంత నుండి యీతఁడే చేరి కొంగువట్టెనంటా
పంతాలేల దుస్సేవే పలుమారును
మంతనాన నాతఁడు మర్మములు ముట్టెనంటా
రంతులేల సేసేవే రచ్చలోనను

(॥॥)
కగ్గులేక యీతఁడిట్టె కాఁగిలించుకొనెనంటా
సిగ్గులేల నెరుపేవే చెలులఁ జూచి
అగ్గమై శ్రీ వేంకటేశుఁ డదె తానె నన్నుఁ గూడె
అగ్గలపురతి నెంత అలయించేవే

(||pallavi||)
magavānido niṁta mārugŏṁdurā
tagavulelaḍigeve tadigŏni nīvu

(||||)
gŏppalainanīsannulu kori pisigĕnaṁṭā
tappulela yĕṁchĕve saṁdaḍim̐ badini
muppirigā lachchĕnalu movimīm̐da nunnavaṁṭā
sŏppulela yĕtteve sodiṁchi nīvu

(||||)
sĕṁta nuṁḍi yīdam̐ḍe seri kŏṁguvaṭṭĕnaṁṭā
paṁtālela dusseve palumārunu
maṁtanāna nādam̐ḍu marmamulu muṭṭĕnaṁṭā
raṁtulela seseve rachchalonanu

(||||)
kaggulega yīdam̐ḍiṭṭĕ kām̐giliṁchugŏnĕnaṁṭā
siggulela nĕrubeve sĕlulam̐ jūsi
aggamai śhrī veṁkaḍeśhum̐ ḍadĕ tānĕ nannum̐ gūḍĕ
aggalaburadi nĕṁta alayiṁcheve