(॥పల్లవి॥)
మగవానితో నేలే మందెమేళాలు
తగవెరిఁగి యాతఁడే దయఁజూచీఁ గాక
(॥మగ॥)
ఇచ్చకములే సేసి ఇంపు చల్లవలెఁగాక
కొచ్చి కొచ్చి రమణునిఁ గొసరుదురా
అచ్చముగా సరసములాడి మెప్పించుటగాక
పెచ్చు వెరిఁగి బలిమిఁ బెనఁగుదురా
(॥మగ॥)
ననుపులు వచరించి నవ్వు నవ్వవలెఁగాక
చెనకి చెనకి పతిఁ జిమ్మిరేఁతురా
వినయపుఁ జేఁతలనే వెడ్డు వెట్టుదురుగాక
చనవుగలదంటాను సాదింతురా
(॥మగ॥)
తలఁపెరిఁగి రతులఁ దనియించవలెఁగాక
అలమి యలమి విభు నలయింతురా
యెలమి శ్రీ వేంకటేశుఁ డీతఁ డిట్టె నిన్నుఁ గూడె
కలికితనాల నింత గరిసింతురా
(||pallavi||)
magavānido nele maṁdĕmeḽālu
tagavĕrim̐gi yādam̐ḍe dayam̐jūsīm̐ gāga
(||maga||)
ichchagamule sesi iṁpu sallavalĕm̐gāga
kŏchchi kŏchchi ramaṇunim̐ gŏsarudurā
achchamugā sarasamulāḍi mĕppiṁchuḍagāga
pĕchchu vĕrim̐gi balimim̐ bĕnam̐gudurā
(||maga||)
nanubulu vasariṁchi navvu navvavalĕm̐gāga
sĕnagi sĕnagi padim̐ jimmirem̐turā
vinayabum̐ jem̐talane vĕḍḍu vĕṭṭudurugāga
sanavugaladaṁṭānu sādiṁturā
(||maga||)
talam̐pĕrim̐gi radulam̐ daniyiṁchavalĕm̐gāga
alami yalami vibhu nalayiṁturā
yĕlami śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
kaligidanāla niṁta garisiṁturā