మగవానితో బలిమి మగువల కమరునా
(॥పల్లవి॥)
మగవానితో బలిమి మగువల కమరునా
వెగటులేక యిట్టె వినయమే సేయవే
(॥మగ॥)
కొంగువట్టి తీసితేను కొప్పు గడువెడజారె
వుంగరాన కొడిసితే నూర్పు రేఁగె
చెంగటఁ బెనఁగితేను చెమటలు మేనఁ జిందె
సంగడి నాతనితోను సాము లెంతసేసేవే
(॥మగ॥)
కడుఁజెనకఁబోతేను కంకణాలు వాఁగఁజొచ్చె
తడవి తిట్టఁగఁబోతేఁ దగదొట్టెను
తడవుగా నవ్వఁగాను తలకెక్కె వలపులు
యెడయక యిందులో నీ వెందుకయ్యేవే
(॥మగ॥)
నాఁటఁగ గాఁగిలించఁగా నడుమఁ జన్నులు చిక్కె
మాటున రతిసేయఁగా మతి గరఁగె
యీటున శ్రీవేంకటేశుఁ డితనిపొందింతసేసె
చీటికిమాటికి నిఁక సిగ్గులేల పెంచేవే
(||pallavi||)
magavānido balimi maguvala kamarunā
vĕgaḍulega yiṭṭĕ vinayame seyave
(||maga||)
kŏṁguvaṭṭi tīsidenu kŏppu gaḍuvĕḍajārĕ
vuṁgarāna kŏḍiside nūrbu rem̐gĕ
sĕṁgaḍam̐ bĕnam̐gidenu sĕmaḍalu menam̐ jiṁdĕ
saṁgaḍi nādanidonu sāmu lĕṁtaseseve
(||maga||)
kaḍum̐jĕnagam̐bodenu kaṁkaṇālu vām̐gam̐jŏchchĕ
taḍavi tiṭṭam̐gam̐bodem̐ dagadŏṭṭĕnu
taḍavugā navvam̐gānu talagĕkkĕ valabulu
yĕḍayaga yiṁdulo nī vĕṁdugayyeve
(||maga||)
nām̐ṭam̐ga gām̐giliṁcham̐gā naḍumam̐ jannulu sikkĕ
māḍuna radiseyam̐gā madi garam̐gĕ
yīḍuna śhrīveṁkaḍeśhum̐ ḍidanibŏṁdiṁtasesĕ
sīḍigimāḍigi nim̐ka siggulela pĕṁcheve