Magavaani maayalu mari yemdugainaa vachchu

మగవాని మాయలు మరి యెందుకైనా వచ్చు
Language

(॥పల్లవి॥)
మగవాని మాయలు మరి యెందుకైనా వచ్చు
వెగటు గాకుండాఁ జెలి విన్నవించుకోవే

(॥మగ॥)
మాఁటలాడవచ్చుఁగాని మనసు దెలియరాదు
నాఁటఁ జూడవచ్చుఁగాని నవ్వించరాదు
సూటి చూపవచ్చుఁగాని చొచ్చి గురివేయరాదు
తేటగా నాతని బుద్ధి తెలుసుకోవే

(॥మగ॥)
మోము చూడవచ్చుఁగాని మోహము వుట్టించరాదు
కామించఁగవచ్చుఁగాని కరఁచరాదు
సాముసేయవచ్చుఁగాని చలము సాదించరాదు
గామిడి యీతనిబత్తి గనుకొనవే

(॥మగ॥)
తలఁపించవచ్చుఁగాని తరితీపు రేఁచరాదు
కలయఁగవచ్చుఁగాని గద్దించరాదు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁగూడె
సొలసి యాతని పొందు సోదించుకోవే

(||pallavi||)
magavāni māyalu mari yĕṁdugainā vachchu
vĕgaḍu gāguṁḍām̐ jĕli vinnaviṁchugove

(||maga||)
mām̐ṭalāḍavachchum̐gāni manasu dĕliyarādu
nām̐ṭam̐ jūḍavachchum̐gāni navviṁcharādu
sūḍi sūbavachchum̐gāni sŏchchi guriveyarādu
teḍagā nādani buddhi tĕlusugove

(||maga||)
momu sūḍavachchum̐gāni mohamu vuṭṭiṁcharādu
kāmiṁcham̐gavachchum̐gāni karam̐sarādu
sāmuseyavachchum̐gāni salamu sādiṁcharādu
gāmiḍi yīdanibatti ganugŏnave

(||maga||)
talam̐piṁchavachchum̐gāni taridību rem̐sarādu
kalayam̐gavachchum̐gāni gaddiṁcharādu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐gūḍĕ
sŏlasi yādani pŏṁdu sodiṁchugove