మగవాని కింతయేల మరి కొంకను
(॥పల్లవి॥)
మగవాని కింతయేల మరి కొంకను
అగడు సేయకు మమ్ము నందరిలో నిఁకను
(॥॥)
అంగనతో నీవేకత మాడేవేళ వచ్చితేను
చెంగట నేఁడెంతేసి సిగ్గువడేవు
సంగతి నీవూడిగపు సతులలోదానఁ గానా
వెంగెము సేసుక యెంత వేరుసేసేవు
(॥॥)
సరసిజాక్షితో నవ్వే సమయాన నే మొక్కితే
శిరసు వంచుక యాల సిగ్గువడేవు
అరిది నీరాణివామైనట్టి దానఁగానా
విరులమాఁటున నేల వెరగువడేవు
(॥॥)
యీవేళ నింతిఁ గూడితి విట్టే నేనుఁ గూడితేను
శ్రీవేంకటేశుఁడ యేల సిగ్గువడేవు
గోవిందరాజ నిన్నుఁ గొలిచినదానఁ గానా
వేవేలు రతుల నేల వింతలు సేసేవు
(||pallavi||)
magavāni kiṁtayela mari kŏṁkanu
agaḍu seyagu mammu naṁdarilo nim̐kanu
(||||)
aṁganado nīvegada māḍeveḽa vachchidenu
sĕṁgaḍa nem̐ḍĕṁtesi sigguvaḍevu
saṁgadi nīvūḍigabu sadulalodānam̐ gānā
vĕṁgĕmu sesuga yĕṁta verusesevu
(||||)
sarasijākṣhido navve samayāna ne mŏkkide
śhirasu vaṁchuga yāla sigguvaḍevu
aridi nīrāṇivāmainaṭṭi dānam̐gānā
virulamām̐ṭuna nela vĕraguvaḍevu
(||||)
yīveḽa niṁtim̐ gūḍidi viṭṭe nenum̐ gūḍidenu
śhrīveṁkaḍeśhum̐ḍa yela sigguvaḍevu
goviṁdarāja ninnum̐ gŏlisinadānam̐ gānā
vevelu radula nela viṁtalu sesevu