Magavaani keda siggu maguvala kimtegaaga

మగవాని కేడ సిగ్గు మగువల కింతేకాక
Language

(॥పల్లవి॥)
మగవాని కేడ సిగ్గు మగువల కింతేకాక
యెగసక్కేలాడేనంటా యేల నవ్వేవిపుడు

(॥॥)
మంతనాన నిద్దరము మాటలాడుకొన్న వెల్లా
యింతలోనే ఆపె నేఁడు యెట్టెరిఁగెను
చెంతల నీవెమ్మెలకు చెప్పితివేమోకాక
వింతగా నీచెవులనే వినవయ్యా సుద్దులు

(॥॥)
చేరి యింటిలో మనము చేసుకొన్న బాసలు
వారించి యాపెకు నే డెవ్వరు చూపిరి
మేరమీరి మురిపెము మెరసితి వేమోకాక
ఆరీతి నీవే యడుగవయ్యా యీ సుద్దులు

(॥॥)
పానుపు పై నిద్దరము పైకొన్న కూటము లెల్లా
తానకమై యేరీతిగాఁ దలఁచినది
కానీలే నీవే పెద్దరికము చూపేవేమోకాక
మేన శ్రీ వేంకటేశుఁడ మెచ్చవయ్యా సుద్దులు

(||pallavi||)
magavāni keḍa siggu maguvala kiṁtegāga
yĕgasakkelāḍenaṁṭā yela navvevibuḍu

(||||)
maṁtanāna niddaramu māḍalāḍugŏnna vĕllā
yiṁtalone ābĕ nem̐ḍu yĕṭṭĕrim̐gĕnu
sĕṁtala nīvĕmmĕlagu sĕppidivemogāga
viṁtagā nīsĕvulane vinavayyā suddulu

(||||)
seri yiṁṭilo manamu sesugŏnna bāsalu
vāriṁchi yābĕgu ne ḍĕvvaru sūbiri
meramīri muribĕmu mĕrasidi vemogāga
ārīdi nīve yaḍugavayyā yī suddulu

(||||)
pānubu pai niddaramu paigŏnna kūḍamu lĕllā
tānagamai yerīdigām̐ dalam̐sinadi
kānīle nīve pĕddarigamu sūbevemogāga
mena śhrī veṁkaḍeśhum̐ḍa mĕchchavayyā suddulu