మగవాఁడు వలచితేను మగువల జాడ లిట్టె
(॥పల్లవి॥)
మగవాఁడు వలచితేను మగువల జాడ లిట్టె
అగడుగానేల అడియాసలఁ బెట్టేవే
(॥॥)
ఇచ్చకముతోడఁ బతి ఇంటికిఁ బిలువఁగాను
పెచ్చురేఁగి నీవేల పెనఁగేనే
కచ్చుపెట్టి రతులకుఁ గాచుకుండితి నిందాఁకా
తెచ్చుకోలై యేల తరితీపునేసేవే
(॥॥)
ననుపు చూపి యతఁడు నవ్వులు నవ్వఁగాను
గునియుచుఁ దలవంచుకొననేఁటికే
వొనరఁ గానుకలు నీవొసఁగితి విందాకా
పనివూని నీ వెంత బయలీఁదించేవే
(॥॥)
శ్రీవేంకటేశుఁడు చేరి నిన్నుఁ గూడఁగాను
చేవదేర నీవేల సిగ్గువడేవే
యీవల నన్నితఁడే యేలి మన్నించినాఁడు
భావ మెఱిఁగికనేల భ్రమయించేవే
(||pallavi||)
magavām̐ḍu valasidenu maguvala jāḍa liṭṭĕ
agaḍugānela aḍiyāsalam̐ bĕṭṭeve
(||||)
ichchagamudoḍam̐ badi iṁṭigim̐ biluvam̐gānu
pĕchchurem̐gi nīvela pĕnam̐gene
kachchubĕṭṭi radulagum̐ gāsuguṁḍidi niṁdām̐kā
tĕchchugolai yela taridībuneseve
(||||)
nanubu sūbi yadam̐ḍu navvulu navvam̐gānu
guniyusum̐ dalavaṁchugŏnanem̐ṭige
vŏnaram̐ gānugalu nīvŏsam̐gidi viṁdāgā
panivūni nī vĕṁta bayalīm̐diṁcheve
(||||)
śhrīveṁkaḍeśhum̐ḍu seri ninnum̐ gūḍam̐gānu
sevadera nīvela sigguvaḍeve
yīvala nannidam̐ḍe yeli manniṁchinām̐ḍu
bhāva mĕṟim̐giganela bhramayiṁcheve