మగవాఁడు వలచితే మరి చేతఁ బట్ట రాదు
(॥పల్లవి॥)
మగవాఁడు వలచితే మరి చేతఁ బట్ట రాదు
తగుదునా నే నీకు తమకించే విపుడు
(॥మగవాడు॥)
ఆన వెట్టకుర నీ వన్నట్టె వినేఁగాని
మాన వెంత చెప్పినా నీ మంకువోజలూ
కాని మ్మన్నా మొక్కేవు కాఁ గాని దోసాన
నే నెంత నీ వెంత నీకు నేబాఁ తైతిఁగా
(॥మగవాడు॥)
చెక్కు నొక్కకుర నీవు చెప్పినట్టే సేసేఁ గాని
యిక్కడ నవ్వేవారి నెఱఁగ వోరి
యిక్కువ లంట వచ్చేవు యెంగి లని చూడవు
చక్కనివాఁడవు నే నీసాటికి రాఁ గలవా
(॥మగవాడు॥)
పొగడకురా నేనీ పొందులు విడువఁ గాని
నగవులు మానవు నాతో నీవు
తగు లై శ్రీవెంకటేశ తతి నన్నుఁ గూడితివి
మొగము చూచే వింకా మోహ మింత గలదా
(||pallavi||)
magavām̐ḍu valaside mari sedam̐ baṭṭa rādu
tagudunā ne nīgu tamagiṁche vibuḍu
(||magavāḍu||)
āna vĕṭṭagura nī vannaṭṭĕ vinem̐gāni
māna vĕṁta sĕppinā nī maṁkuvojalū
kāni mmannā mŏkkevu kām̐ gāni dosāna
ne nĕṁta nī vĕṁta nīgu nebām̐ taidim̐gā
(||magavāḍu||)
sĕkku nŏkkagura nīvu sĕppinaṭṭe sesem̐ gāni
yikkaḍa navvevāri nĕṟam̐ga vori
yikkuva laṁṭa vachchevu yĕṁgi lani sūḍavu
sakkanivām̐ḍavu ne nīsāḍigi rām̐ galavā
(||magavāḍu||)
pŏgaḍagurā nenī pŏṁdulu viḍuvam̐ gāni
nagavulu mānavu nādo nīvu
tagu lai śhrīvĕṁkaḍeśha tadi nannum̐ gūḍidivi
mŏgamu sūse viṁkā moha miṁta galadā