Magavaamdu taanu maguvanu nenu

మగవాఁడు తాను మగువను నేను
Language

(॥పల్లవి॥)
మగవాఁడు తాను మగువను నేను
నగుమనవే యిట్టే నాలి యాల యిఁకను

(॥మగ॥)
కన్నులఁజూచినప్పుడే కాఁకలెల్లాఁ జల్లనాయ
యెన్నికేల రమ్మనవే యేమనే నేను
సన్నలు సేసినప్పుడే చనవెల్ల నాకిచ్చె
విన్నవించనే తనకు వెఱుపేల యిఁకను

(॥మగ॥)
యింటికివచ్చినప్పుడే యియ్యకోళ్లాయ నాకు
జంటయై యుండుమనవే సాదించ నేను
అంటిముట్టినయప్పుడే ఆయములెల్లాఁ గరఁగె
దంటతనమే మేలు తప్పులేదు యిఁకను

(॥మగ॥)
కలసినయప్పుడే కడమలు లేవు నాకు
బలువుఁడు తా ననవే పైకొంటి నేను
అలరి శ్రీవేంకటేశుఁ డన్నిటాఁ దానన్ను నేలె
వలపు లిద్దరివాయ వంతులేలే ఇఁకను

(||pallavi||)
magavām̐ḍu tānu maguvanu nenu
nagumanave yiṭṭe nāli yāla yim̐kanu

(||maga||)
kannulam̐jūsinappuḍe kām̐kalĕllām̐ jallanāya
yĕnnigela rammanave yemane nenu
sannalu sesinappuḍe sanavĕlla nāgichchĕ
vinnaviṁchane tanagu vĕṟubela yim̐kanu

(||maga||)
yiṁṭigivachchinappuḍe yiyyagoḽlāya nāgu
jaṁṭayai yuṁḍumanave sādiṁcha nenu
aṁṭimuṭṭinayappuḍe āyamulĕllām̐ garam̐gĕ
daṁṭadaname melu tappuledu yim̐kanu

(||maga||)
kalasinayappuḍe kaḍamalu levu nāgu
baluvum̐ḍu tā nanave paigŏṁṭi nenu
alari śhrīveṁkaḍeśhum̐ ḍanniḍām̐ dānannu nelĕ
valabu liddarivāya vaṁtulele im̐kanu