(॥పల్లవి॥)
మగవాఁడు తాను మానిని నేను
తగవులఁ బెట్ట నిందు తనకుఁ జోటేదే
(॥మగ॥)
నిక్కి నిక్కి తాఁజూచె నే నందుకు నవ్వితిని
యెక్కువైన రమణుఁడు యేమనీనే
వెక్కసపు నిమ్మపంట వేసె నేఁ బులకించితి
తక్కిన సుద్దులేల తడవీనే తాను
(॥మగ॥)
రమ్మని పేరఁ బిలిచేరంతున నే నూఁకొంటి
యెమ్మెలకు విభుఁడు నన్నేమనీనే
కమ్మరఁ దా సన్నసేసె కాయము నే మరచుంటి
అమ్మరో యింకా నన్నాడ జోటేదే
(॥మగ॥)
కందువఁ దాఁ గాఁగిలించె కరఁగితి నట్టె నేను
యిందుకు శ్రీవేంకటేశుఁ డేమనీనే
అంది తానె మోవి ఇచ్చె నలములుమంగ నేను
ముందవెన కించచూడ మొరఁ గిందుఁ గలదా
(||pallavi||)
magavām̐ḍu tānu mānini nenu
tagavulam̐ bĕṭṭa niṁdu tanagum̐ joḍede
(||maga||)
nikki nikki tām̐jūsĕ ne naṁdugu navvidini
yĕkkuvaina ramaṇum̐ḍu yemanīne
vĕkkasabu nimmabaṁṭa vesĕ nem̐ bulagiṁchidi
takkina suddulela taḍavīne tānu
(||maga||)
rammani peram̐ biliseraṁtuna ne nūm̐kŏṁṭi
yĕmmĕlagu vibhum̐ḍu nannemanīne
kammaram̐ dā sannasesĕ kāyamu ne marasuṁṭi
ammaro yiṁkā nannāḍa joḍede
(||maga||)
kaṁduvam̐ dām̐ gām̐giliṁchĕ karam̐gidi naṭṭĕ nenu
yiṁdugu śhrīveṁkaḍeśhum̐ ḍemanīne
aṁdi tānĕ movi ichchĕ nalamulumaṁga nenu
muṁdavĕna kiṁchasūḍa mŏram̐ giṁdum̐ galadā