Magavaamdu goola yaide mari sedam batta raadu

మగవాఁడు గూళ యైతే మరి చేతఁ బట్ట రాదు
Language

(॥పల్లవి॥)
మగవాఁడు గూళ యైతే మరి చేతఁ బట్ట రాదు
తగ వెరఁగక నీవే తమకించే విదివో

(॥మగవాడు॥)
అంగనకు నీమనసు అరిసి తెలయుదాఁకా
నంగవించి నవ్వ దాయ నందుకే కదా
కుంగుచు నీవది చూచి కోపగించి వున్న దంటా
నండగిఁ బెట్టి వలపు లాడుకొనే విదివో

(॥మగవాడు॥)
పడఁతికి నీ వాకడి పరాకు మానినదాఁకా
నడరి నీతో మాటాడ దుందుకే కదా
కడగి నీతో నాపె కైకొనక వున్న దంటా
వుడివోక గోర సేసి వుప్పతించే విదివో

(॥మగవాడు॥)
జలజాక్షికిని నేవీ చనవు లిచ్చినదాఁకా
నలమక వూరకుండె నందుకే కాదా
యెలమి శ్రీవెంకటేశ యిట్టె నీవే కూడితివి
చలము చెల్లించే నంటా జట్టిగొనే విదివో

(||pallavi||)
magavām̐ḍu gūḽa yaide mari sedam̐ baṭṭa rādu
taga vĕram̐gaga nīve tamagiṁche vidivo

(||magavāḍu||)
aṁganagu nīmanasu arisi tĕlayudām̐kā
naṁgaviṁchi navva dāya naṁduge kadā
kuṁgusu nīvadi sūsi kobagiṁchi vunna daṁṭā
naṁḍagim̐ bĕṭṭi valabu lāḍugŏne vidivo

(||magavāḍu||)
paḍam̐tigi nī vāgaḍi parāgu māninadām̐kā
naḍari nīdo māḍāḍa duṁduge kadā
kaḍagi nīdo nābĕ kaigŏnaga vunna daṁṭā
vuḍivoga gora sesi vuppadiṁche vidivo

(||magavāḍu||)
jalajākṣhigini nevī sanavu lichchinadām̐kā
nalamaga vūraguṁḍĕ naṁduge kādā
yĕlami śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nīve kūḍidivi
salamu sĕlliṁche naṁṭā jaṭṭigŏne vidivo