మగవాఁడు ధీరుఁడు మన విప్పఁగ మోపు
(॥పల్లవి॥)
మగవాఁడు ధీరుఁడు మన విప్పఁగ మోపు
నగవయ్యా ఆపెతోను నాథుఁడవు నీవు
(॥మగ॥)
నేరుపరియైనదే నిండుకొని యుండ నేర్చు
నారీతి నాఱడికత్తె ఆడు వెంగేలు
మేరతోఁ గోపించ వద్దు మెచ్చ వద్దు అంతలోనే
ఆరితేరి నీచేతిది ఆఁటదానిగుణము
(॥మగ॥)
చనవరియైనది సమ్మతించు నన్నిటికి
పెనఁగి మంకువోజది పెచ్చువెరుగు
కినియఁగ వద్దు మఱి కిందుపడి మొక్కవద్దు
అనయము నీచేతిది ఆఁటదానిగుణము
(॥మగ॥)
వలపు గలిగి వడివడిఁ దా నింటికి వచ్చు
పెలుచుపంతాలది పిలిపించును
యెలమి శ్రీవేంకటేశ యింతి నిట్టే కూడితివి
అలరఁగ నీచేతిది ఆఁటదానిగుణమా
(||pallavi||)
magavām̐ḍu dhīrum̐ḍu mana vippam̐ga mobu
nagavayyā ābĕdonu nāthum̐ḍavu nīvu
(||maga||)
nerubariyainade niṁḍugŏni yuṁḍa nersu
nārīdi nāṟaḍigattĕ āḍu vĕṁgelu
meradom̐ gobiṁcha vaddu mĕchcha vaddu aṁtalone
ārideri nīsedidi ām̐ṭadāniguṇamu
(||maga||)
sanavariyainadi sammadiṁchu nanniḍigi
pĕnam̐gi maṁkuvojadi pĕchchuvĕrugu
kiniyam̐ga vaddu maṟi kiṁdubaḍi mŏkkavaddu
anayamu nīsedidi ām̐ṭadāniguṇamu
(||maga||)
valabu galigi vaḍivaḍim̐ dā niṁṭigi vachchu
pĕlusubaṁtāladi pilibiṁchunu
yĕlami śhrīveṁkaḍeśha yiṁti niṭṭe kūḍidivi
alaram̐ga nīsedidi ām̐ṭadāniguṇamā