Magavaamdu bhramasina mari telubamgaraadu

మగవాఁడు భ్రమసిన మరి తెలుపఁగరాదు
Language

(॥పల్లవి॥)
మగవాఁడు భ్రమసిన మరి తెలుపఁగరాదు
నగుఁబాటు చూడరమ్మ నాటకీఁడు కృష్ణుఁడు

(॥మగ॥)
కోవిల గుయ్యఁగాను గోపిక పిలిచె నంటా
ఆవల దగ్గరఁ బోయి అందుఁ గానక
ఆవేళ నొక్కనెమలి యాడ నేగఁగాఁ జూచి
బావించి చెలి యనుచుఁ బట్టఁబోయఁ గృష్ణుఁడు

(॥మగ॥)
తీగె యల్లాడఁగాఁ జూచి తెఱవచేసన్న లివి
నాగతి ననుచుఁ జేరి యటు గానక
సోగల నందుఁ గొలనిసొంపుఁ దామెరను జూచి
భాగులఁ జెవిమో మని పట్టఁ బోయఁ గృష్ణుఁడు

(॥మగ॥)
చెట్టుపైఁ బూవులు రాల చెలి సేసవెట్టె నంటా
అట్టే శ్రీవేంకటేశుఁ డాలకించఁగా
కట్టఁగడ నింతి యది గని నిజముగ వచ్చి
యెట్ట యెదుటనే వుండె నేచి కూడెఁ గృష్ణుఁడు

(||pallavi||)
magavām̐ḍu bhramasina mari tĕlubam̐garādu
nagum̐bāḍu sūḍaramma nāḍagīm̐ḍu kṛṣhṇum̐ḍu

(||maga||)
kovila guyyam̐gānu gobiga pilisĕ naṁṭā
āvala daggaram̐ boyi aṁdum̐ gānaga
āveḽa nŏkkanĕmali yāḍa negam̐gām̐ jūsi
bāviṁchi sĕli yanusum̐ baṭṭam̐boyam̐ gṛṣhṇum̐ḍu

(||maga||)
tīgĕ yallāḍam̐gām̐ jūsi tĕṟavasesanna livi
nāgadi nanusum̐ jeri yaḍu gānaga
sogala naṁdum̐ gŏlanisŏṁpum̐ dāmĕranu jūsi
bhāgulam̐ jĕvimo mani paṭṭam̐ boyam̐ gṛṣhṇum̐ḍu

(||maga||)
sĕṭṭubaim̐ būvulu rāla sĕli sesavĕṭṭĕ naṁṭā
aṭṭe śhrīveṁkaḍeśhum̐ ḍālagiṁcham̐gā
kaṭṭam̐gaḍa niṁti yadi gani nijamuga vachchi
yĕṭṭa yĕduḍane vuṁḍĕ nesi kūḍĕm̐ gṛṣhṇum̐ḍu