మగవాఁడవు నీతో మల్లువోరేమా
(॥పల్లవి॥)
మగవాఁడవు నీతో మల్లువోరేమా
చిగురువంటి మమ్ము చేఁగ రేఁచేవా
(॥మగ॥)
ఆఁటదానికోపమెంత అదే నెపము సేసి
మాటి మాటికిని నీవు మారలిగేవా
సూటికిఁ బతి రాకున్న సొలతురు మలతురు
తోటకూరవంటినన్ను దూరు సేసేవా
(॥మగ॥)
పిన్నదానిగుంపెనెంత పెద్ద సేసి నీవందుకు
సన్నల చాయలఁ దిద్ది సాదించేవా
మన్ననలెచ్చుకుందైతే మందెమేళాలాడుదురు
వెన్నవంటినన్ను నీవు వెగట్లాడేవా
(॥మగ॥)
లక్కవంటి సతియెంత లావునఁ బెనఁగెనంటా
కక్కసించి రతులలో ఘాత సేసేవు
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
చక్కెరవంటినన్ను చవులడిగేవా
(||pallavi||)
magavām̐ḍavu nīdo malluvoremā
siguruvaṁṭi mammu sem̐ga rem̐sevā
(||maga||)
ām̐ṭadānigobamĕṁta ade nĕbamu sesi
māḍi māḍigini nīvu māraligevā
sūḍigim̐ badi rāgunna sŏladuru maladuru
toḍagūravaṁṭinannu dūru sesevā
(||maga||)
pinnadāniguṁpĕnĕṁta pĕdda sesi nīvaṁdugu
sannala sāyalam̐ diddi sādiṁchevā
mannanalĕchchuguṁdaide maṁdĕmeḽālāḍuduru
vĕnnavaṁṭinannu nīvu vĕgaṭlāḍevā
(||maga||)
lakkavaṁṭi sadiyĕṁta lāvunam̐ bĕnam̐gĕnaṁṭā
kakkasiṁchi radulalo ghāda sesevu
akkuna śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
sakkĕravaṁṭinannu savulaḍigevā