Magavaamdaidene siggu maanavalenaa

మగవాఁడైతేనే సిగ్గు మానవలెనా
Language

(॥పల్లవి॥)
మగవాఁడైతేనే సిగ్గు మానవలెనా
యెగసక్కె మవుఁ బని యింటికి రారాదా

(॥మగ॥)
యెందుకైనా నవ్వేవారి నెఱఁగవు తమకించి
పందెము వేయఁగానే పట్టేవు చేయి
విందువేడకకానికి వెసలఁబెట్టినకత
యిందులోనే నెరపనేల యింటికి రారాదా

(॥మగ॥)
సొరది సోరణగండ్లఁజూచేవారి నెఱఁగవు
సరిబేసి వట్టుమంటే చన్నులంటేవు
గరిమఁ బట్టినదే కందిగురుమన్న కత
ఇరవు చూపనేల ఇంటికి రారాదా

(॥మగ॥)
అనుక శ్రీవేంకటేశ ఆడేవారి నెఱంగవు
కానుకలిచ్చేవేళనే కాఁగిలించేవు
మోనమున నందరిలో ముట్టితే మూయాయఁగత
యీనవ్వులలోఁ గంటిమి ఇంటికి రారాదా

(||pallavi||)
magavām̐ḍaidene siggu mānavalĕnā
yĕgasakkĕ mavum̐ bani yiṁṭigi rārādā

(||maga||)
yĕṁdugainā navvevāri nĕṟam̐gavu tamagiṁchi
paṁdĕmu veyam̐gāne paṭṭevu seyi
viṁduveḍagagānigi vĕsalam̐bĕṭṭinagada
yiṁdulone nĕrabanela yiṁṭigi rārādā

(||maga||)
sŏradi soraṇagaṁḍlam̐jūsevāri nĕṟam̐gavu
saribesi vaṭṭumaṁṭe sannulaṁṭevu
garimam̐ baṭṭinade kaṁdigurumanna kada
iravu sūbanela iṁṭigi rārādā

(||maga||)
anuga śhrīveṁkaḍeśha āḍevāri nĕṟaṁgavu
kānugalichcheveḽane kām̐giliṁchevu
monamuna naṁdarilo muṭṭide mūyāyam̐gada
yīnavvulalom̐ gaṁṭimi iṁṭigi rārādā