మగవాఁడట తన ఇచ్చట(లు?) మారుకొనేనా; ఇందుకు
(॥పల్లవి॥)
మగవాఁడట తన ఇచ్చట(లు?) మారుకొనేనా; ఇందుకు
చిగిరించెను జవ్వన మిఁకఁ జెల్లుననరె తనకు
(॥మగ॥)
అడిగితినా తను బాసలు అపుడే యేఁటికిఁ జేసీ
నొడిగితినా నేనే మాటలు నూఁటికి నొకటైనా
విడువఁడు కొంగెంతైనా వేసరుకొన్నా మానఁడు
చిడుముడిబుద్దులు చెప్పరె చెలులాల మీరైనా
(॥మగ॥)
యేమాయనే తనసుద్దుల కెదురాడే వారెవ్వరు
కాముకునికిసత్యంబులు గలవా యెందైనా
చేముట్టిచీ విడెము సిగ్గులువడినా నెరఁగఁడు
యేమందునే మీరైనా నింటికి రమ్మనఁగదరే
(॥మగ॥)
మఱఁగేఁటికి విచ్చనవిడి మాన్యం బిచ్చితిఁ జేఁతలు
తఱితోడనే మన్నించీఁ దాఁదానే నన్ను
కఱతల శ్రీవేంకటపతి గక్కన నన్నిటు గూడెను
మేఱయఁగ బొగడరే ఇంతట మీరైనా నితని
(||pallavi||)
magavām̐ḍaḍa tana ichchaḍa(lu?) mārugŏnenā; iṁdugu
sigiriṁchĕnu javvana mim̐kam̐ jĕllunanarĕ tanagu
(||maga||)
aḍigidinā tanu bāsalu abuḍe yem̐ṭigim̐ jesī
nŏḍigidinā nene māḍalu nūm̐ṭigi nŏgaḍainā
viḍuvam̐ḍu kŏṁgĕṁtainā vesarugŏnnā mānam̐ḍu
siḍumuḍibuddulu sĕpparĕ sĕlulāla mīrainā
(||maga||)
yemāyane tanasuddula kĕdurāḍe vārĕvvaru
kāmugunigisatyaṁbulu galavā yĕṁdainā
semuṭṭisī viḍĕmu sigguluvaḍinā nĕram̐gam̐ḍu
yemaṁdune mīrainā niṁṭigi rammanam̐gadare
(||maga||)
maṟam̐gem̐ṭigi vichchanaviḍi mānyaṁ bichchidim̐ jem̐talu
taṟidoḍane manniṁchīm̐ dām̐dāne nannu
kaṟadala śhrīveṁkaḍabadi gakkana nanniḍu gūḍĕnu
meṟayam̐ga bŏgaḍare iṁtaḍa mīrainā nidani