Magavaamda vauduvu mari ninnu mechchidini

మగవాఁడ వౌదువు మరి నిన్ను మెచ్చితిని
Language

(॥పల్లవి॥)
మగవాఁడ వౌదువు మరి నిన్ను మెచ్చితిని
తగవింత నేరకుంటే తతి నన్నేలుదువా

(॥॥)
యేడకేడ రుకుమిణి నెలయించి యింటికి
వేడుకతోఁ దెచ్చుకొంటివిగా నీవు
జోడుగాఁ బదారువేలు సుదతులఁ దెచ్చుకొంటి-
వాడికెకు వెఱవవు అవుఁగా నీవు

(॥॥)
వూరిలోని గొల్లెతల నొకతె నొకతెనే
వీరుఁడవై యంటుకొంటివిగా నీవు
బీరాన రాచకూఁతులు పెండ్లాడినట్టివారు
అరీతిఁ బట్టపు దేవుళ్ళట కా నీకు

(॥॥)
వరుస మధురలోని వారకాంతల నెల్లా
వెరసువేసి పొందితివిగా నీవు
సిరుల శ్రీవేంకటేశ శ్రీసతి నంటా నన్ను
వురమెక్కించుకొంటివి వోపికగా నీది

(||pallavi||)
magavām̐ḍa vauduvu mari ninnu mĕchchidini
tagaviṁta neraguṁṭe tadi nanneluduvā

(||||)
yeḍageḍa rugumiṇi nĕlayiṁchi yiṁṭigi
veḍugadom̐ dĕchchugŏṁṭivigā nīvu
joḍugām̐ badāruvelu sudadulam̐ dĕchchugŏṁṭi-
vāḍigĕgu vĕṟavavu avum̐gā nīvu

(||||)
vūriloni gŏllĕdala nŏgadĕ nŏgadĕne
vīrum̐ḍavai yaṁṭugŏṁṭivigā nīvu
bīrāna rāsagūm̐tulu pĕṁḍlāḍinaṭṭivāru
arīdim̐ baṭṭabu devuḽḽaḍa kā nīgu

(||||)
varusa madhuraloni vāragāṁtala nĕllā
vĕrasuvesi pŏṁdidivigā nīvu
sirula śhrīveṁkaḍeśha śhrīsadi naṁṭā nannu
vuramĕkkiṁchugŏṁṭivi vobigagā nīdi