Magavaam dogarisommaa maramgulela petteve

మగవాఁ డొకరిసొమ్మా మరఁగులేల పెట్టేవే
Language

(॥పల్లవి॥)
మగవాఁ డొకరిసొమ్మా మరఁగులేల పెట్టేవే
తగఁ బూగుత్తికి తుమ్మిదలు చేరవలదా

(॥మగ॥)
కన్నులఁ బతిఁ జూచితేఁ గాఁగిలించినట్టయ్యానా
మిన్నక యేఁటి కీకొడిమెలు గట్టేవే
సన్నలు సేసితేనే చాయలంటుకొనీనా
యెన్నేసి సణఁగులు నీవేల రాలిచేవే

(॥మగ॥)
ఆటలాడినంతలోనే మనసు చిక్కుకొనీనా
చాటుతా నీవేల యెగసక్కేలాడేవే
తేటగాఁ గొలువుసేసితే వావిగలసీనా
గాటముగా నీవెంత గయ్యళించేవే

(॥మగ॥)
అండఁ గూచున్నంతలోనే ఆయములు దాఁకీనా
వుండుండి నీవెంత యిందు వుప్పతించేవే
నిండుకొని శ్రీవేంకటనిలయఁడు నన్ను గూడె
చెందితోడ నీవేమి సాదించేవే

(||pallavi||)
magavām̐ ḍŏgarisŏmmā maram̐gulela pĕṭṭeve
tagam̐ būguttigi tummidalu seravaladā

(||maga||)
kannulam̐ badim̐ jūsidem̐ gām̐giliṁchinaṭṭayyānā
minnaga yem̐ṭi kīgŏḍimĕlu gaṭṭeve
sannalu sesidene sāyalaṁṭugŏnīnā
yĕnnesi saṇam̐gulu nīvela rāliseve

(||maga||)
āḍalāḍinaṁtalone manasu sikkugŏnīnā
sāḍudā nīvela yĕgasakkelāḍeve
teḍagām̐ gŏluvuseside vāvigalasīnā
gāḍamugā nīvĕṁta gayyaḽiṁcheve

(||maga||)
aṁḍam̐ gūsunnaṁtalone āyamulu dām̐kīnā
vuṁḍuṁḍi nīvĕṁta yiṁdu vuppadiṁcheve
niṁḍugŏni śhrīveṁkaḍanilayam̐ḍu nannu gūḍĕ
sĕṁdidoḍa nīvemi sādiṁcheve