(॥పల్లవి॥)
మగవాఁ డెటుండినా నమరుగాక
తగవు దప్పవచ్చునా తరుణులకు
(॥మగ॥)
కొలదితో కూరిములు గొసరుట యింతేకాక
బలిమిసేయుచు నిన్నుఁ బట్టవచ్చునా
వొలసి నొల్లములైనా వొద్దనే వుండుట గాక
తలఁగ వచ్చునా మరి తరుణులకు
(॥మగ॥)
వొట్టినమోహముతోడ నొడఁబరచుట గాక
దిట్టతనము నిన్ను దిట్టవచ్చునా
యెట్టు సేసినా మరి యిచ్చకమాడుటగాక
దట్టించి మీరవచ్చునా తరుణులకు
(॥మగ॥)
మొక్కుచుఁ బ్రియముతోడ ముందర నుండుటగాక
వెక్కసమై నీపై తప్పువేయవచ్చునా
యిక్కువతో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
తక్కి యలుగవచ్చునా తరుణులకు
(||pallavi||)
magavām̐ ḍĕḍuṁḍinā namarugāga
tagavu dappavachchunā taruṇulagu
(||maga||)
kŏladido kūrimulu gŏsaruḍa yiṁtegāga
balimiseyusu ninnum̐ baṭṭavachchunā
vŏlasi nŏllamulainā vŏddane vuṁḍuḍa gāga
talam̐ga vachchunā mari taruṇulagu
(||maga||)
vŏṭṭinamohamudoḍa nŏḍam̐barasuḍa gāga
diṭṭadanamu ninnu diṭṭavachchunā
yĕṭṭu sesinā mari yichchagamāḍuḍagāga
daṭṭiṁchi mīravachchunā taruṇulagu
(||maga||)
mŏkkusum̐ briyamudoḍa muṁdara nuṁḍuḍagāga
vĕkkasamai nībai tappuveyavachchunā
yikkuvado śhrīveṁkaḍeśha nannu nelidivi
takki yalugavachchunā taruṇulagu