Magavaadu bhramaside maguvalu deliberaa

మగవాడు భ్రమసితే మగువలు దెలిపేరా
Language

(॥పల్లవి॥)
మగవాడు భ్రమసితే మగువలు దెలిపేరా
తగులై వుండఁగానే తలఁచకుండుదురా

(॥మగ॥)
కడుఁ జల్లనిచూపుల కాంత నిన్నుఁ జూడఁగాను
యెడలేని కాఁకలు నీకేల రేఁగెను
వుడివోని కొనగోర నూఁది యెచ్చరించఁగాను
అడరి నివ్వెరఁగులు అమరునా నీకు

(॥మగ॥)
సంతోసపుమాటలు సతి నీతో నాడఁగాను
ఇంతలోనే వెడచింత లేల వచ్చెను
వింత వింత నగవులు వేమారు నవ్వఁగాను
చెంతనుండి పంతములు చెల్లునా నీకు

(॥మగ॥)
వాడికకాఁగిట నిన్ను వనితఁగూడఁగాను
యేడలేని తమకము లేల వచ్చెను
యీడనె శ్రీవేంకటేశ యీకె నిన్ను మెచ్చఁగాను
ఆడుకోలు బీరములు అందమౌనా నీకు

(||pallavi||)
magavāḍu bhramaside maguvalu dĕliberā
tagulai vuṁḍam̐gāne talam̐saguṁḍudurā

(||maga||)
kaḍum̐ jallanisūbula kāṁta ninnum̐ jūḍam̐gānu
yĕḍaleni kām̐kalu nīgela rem̐gĕnu
vuḍivoni kŏnagora nūm̐di yĕchchariṁcham̐gānu
aḍari nivvĕram̐gulu amarunā nīgu

(||maga||)
saṁtosabumāḍalu sadi nīdo nāḍam̐gānu
iṁtalone vĕḍasiṁta lela vachchĕnu
viṁta viṁta nagavulu vemāru navvam̐gānu
sĕṁtanuṁḍi paṁtamulu sĕllunā nīgu

(||maga||)
vāḍigagām̐giḍa ninnu vanidam̐gūḍam̐gānu
yeḍaleni tamagamu lela vachchĕnu
yīḍanĕ śhrīveṁkaḍeśha yīgĕ ninnu mĕchcham̐gānu
āḍugolu bīramulu aṁdamaunā nīgu