మగరూపు నాఁడురూపు మక్కళించి ఇట్టె తన్నుఁ
(॥పల్లవి॥)
మగరూపు నాఁడురూపు మక్కళించి ఇట్టె తన్నుఁ
దగిలినవారికెల్ల తమిరేఁచీ నితఁడు
(॥మగ॥)
సతిపయ్యదచెఱఁగే చక్కఁగానుఁ గప్పుకొని
కతగా నొక్కపక్కనే కాఁగిలించుక
చతురత చెక్కుఁజెక్కు జంటగా నదుముకొని
అతివలు కొలువుసేయఁగ నున్నాఁడితఁడు
(॥మగ॥)
పడఁతి ముత్యాలపేరే మెడఁ దాఁ దగిలించుక
అడరి శలవినే మోవందుకొనీని
తొడతొడఁ దగిలించుక తుదలేనియాసలతో
తడివి చెలులతో నెత్తములాడీ నితఁడు
(॥మగ॥)
తరుణి మందచుదోమతెర మాటు సేసుకొని
సరి శ్రీవేంకటేశుఁ డిచ్చలఁ గూడీని
కరములు కరముల కందువఁ బెనచుకొని
దొరతన మింతులయెదుటఁ జూపీ వితఁడు
(||pallavi||)
magarūbu nām̐ḍurūbu makkaḽiṁchi iṭṭĕ tannum̐
dagilinavārigĕlla tamirem̐sī nidam̐ḍu
(||maga||)
sadibayyadasĕṟam̐ge sakkam̐gānum̐ gappugŏni
kadagā nŏkkabakkane kām̐giliṁchuga
sadurada sĕkkum̐jĕkku jaṁṭagā nadumugŏni
adivalu kŏluvuseyam̐ga nunnām̐ḍidam̐ḍu
(||maga||)
paḍam̐ti mutyālabere mĕḍam̐ dām̐ dagiliṁchuga
aḍari śhalavine movaṁdugŏnīni
tŏḍadŏḍam̐ dagiliṁchuga tudaleniyāsalado
taḍivi sĕlulado nĕttamulāḍī nidam̐ḍu
(||maga||)
taruṇi maṁdasudomadĕra māḍu sesugŏni
sari śhrīveṁkaḍeśhum̐ ḍichchalam̐ gūḍīni
karamulu karamula kaṁduvam̐ bĕnasugŏni
dŏradana miṁtulayĕduḍam̐ jūbī vidam̐ḍu