మగనితో నేమిటికి మచ్చరములు
(॥పల్లవి॥)
మగనితో నేమిటికి మచ్చరములు
జిగి మించ నిచ్చకము సేయవలెఁ గాక
(॥మగ॥)
సమ్మతించఁ జెప్పితేను సరి నియ్యకొనవద్దా
కమ్మటిని సాదింతురా కాంతుని నీవు
తమ్మివిరుల వేసితే తాఁకి నొచ్చీనందురా
దొమ్మిసేఁతలనుచు సంతోసింతురు గాక
(॥మగ॥)
వినయము చూపితేను వేడుక పడవద్దా
పెనుఁగులాడుదురా బిగిసి నీవు
కొనగోరనూఁదితేను గురుతాయ నందురా
ఘనత మర్మాలు కరఁగఁగవలెఁ గాక
(॥మగ॥)
బెరసిసేస చల్లితే పెండ్లియాడవద్దా
సరసమున నేపొద్దు జరపుదురా
అరిది శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగవు నీవు
నిరతి నిన్నే లెఁ బ్రేమనించ వలెఁ గాక
(||pallavi||)
maganido nemiḍigi machcharamulu
jigi miṁcha nichchagamu seyavalĕm̐ gāga
(||maga||)
sammadiṁcham̐ jĕppidenu sari niyyagŏnavaddā
kammaḍini sādiṁturā kāṁtuni nīvu
tammivirula veside tām̐ki nŏchchīnaṁdurā
dŏmmisem̐talanusu saṁtosiṁturu gāga
(||maga||)
vinayamu sūbidenu veḍuga paḍavaddā
pĕnum̐gulāḍudurā bigisi nīvu
kŏnagoranūm̐didenu gurudāya naṁdurā
ghanada marmālu karam̐gam̐gavalĕm̐ gāga
(||maga||)
bĕrasisesa sallide pĕṁḍliyāḍavaddā
sarasamuna nebŏddu jarabudurā
aridi śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁgavu nīvu
niradi ninne lĕm̐ bremaniṁcha valĕm̐ gāga