మగనితో మమ్ముఁ గొంత మాటలాడనీఁ గదవే
(॥పల్లవి॥)
మగనితో మమ్ముఁ గొంత మాటలాడనీఁ గదవే
నిగిడి వూసుక రానేర్తువు గదే
(॥మగని॥)
అతని నేరములెల్ల నడఁచి చవులుసేసి
గతులు చెప్పఁగ నీవు గలవు గదే
సతమై మావంటివారు సారెసారెఁ గొసరఁగ
పతి మాఁటలాడ నీపాలు గదే
(॥మగని॥)
ఇక్కువఁ జేసిన చేఁతకెల్ల పంతమిప్పించి
గక్కన వంకలు దిద్దఁగలవు గదే
వొక్కరొక్కరే వచ్చి వొడివట్టి పెనఁగఁగ
చక్కటులు దిద్దేది నీజాడ గదే
(॥మగని॥)
విరులను వేసి వేసి విన్నపాలు సేసి సేసి
కరుణింపించఁగ నీవు గలవు గదే
అరుదై శ్రీ వేంకటేశుఁడాతఁడే మమ్మిపుడేలె
నిరతపు పొందొనర్చ నీవిద్య గదే
(||pallavi||)
maganido mammum̐ gŏṁta māḍalāḍanīm̐ gadave
nigiḍi vūsuga rānerduvu gade
(||magani||)
adani neramulĕlla naḍam̐si savulusesi
gadulu sĕppam̐ga nīvu galavu gade
sadamai māvaṁṭivāru sārĕsārĕm̐ gŏsaram̐ga
padi mām̐ṭalāḍa nībālu gade
(||magani||)
ikkuvam̐ jesina sem̐tagĕlla paṁtamippiṁchi
gakkana vaṁkalu diddam̐galavu gade
vŏkkarŏkkare vachchi vŏḍivaṭṭi pĕnam̐gam̐ga
sakkaḍulu diddedi nījāḍa gade
(||magani||)
virulanu vesi vesi vinnabālu sesi sesi
karuṇiṁpiṁcham̐ga nīvu galavu gade
arudai śhrī veṁkaḍeśhum̐ḍādam̐ḍe mammibuḍelĕ
niradabu pŏṁdŏnarsa nīvidya gade