Magani sitta merimgi mattudo seva seyave

మగని చిత్త మెరిఁగి మట్టుతో సేవ సేయవే
Language

(॥పల్లవి॥)
మగని చిత్త మెరిఁగి మట్టుతో సేవ సేయవే
వెగటు గాకుండితేనే వేడుకలు మించును

(॥మగని॥)
పలుమారు మాఁటాడితే బయటఁబడును గుట్టు
మలసి నవ్వు నవ్వితే మందె మేళమౌ
నిలిచి చూచితేను నిండును మొగమోటము
వెలి వెళ్లి తిరిగితే వెరపెల్లఁ బాసును

(॥మగ॥)
సారె నింటికి వచ్చితే జడియుఁ బెద్దరికము
వూరకె పెనఁగఁబోతే వొ ళ్లలసును
యీరాని వడిగితేను యేచి వలపు విరుగు
నేరుపులు చెప్పఁబోతే నిగుడు నారజము

(॥మగ॥)
వినయ మెదుగా నైతే వేసటలై తోఁచును
మనసు సోధించఁ బోతే మర్మా లంటును
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్ను నేఁడు
చనవు వెగ్గళమైతే సంతోసాలు రేఁగును

(||pallavi||)
magani sitta mĕrim̐gi maṭṭudo seva seyave
vĕgaḍu gāguṁḍidene veḍugalu miṁchunu

(||magani||)
palumāru mām̐ṭāḍide bayaḍam̐baḍunu guṭṭu
malasi navvu navvide maṁdĕ meḽamau
nilisi sūsidenu niṁḍunu mŏgamoḍamu
vĕli vĕḽli tirigide vĕrabĕllam̐ bāsunu

(||maga||)
sārĕ niṁṭigi vachchide jaḍiyum̐ bĕddarigamu
vūragĕ pĕnam̐gam̐bode vŏ ḽlalasunu
yīrāni vaḍigidenu yesi valabu virugu
nerubulu sĕppam̐bode niguḍu nārajamu

(||maga||)
vinaya mĕdugā naide vesaḍalai tom̐sunu
manasu sodhiṁcham̐ bode marmā laṁṭunu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnu nem̐ḍu
sanavu vĕggaḽamaide saṁtosālu rem̐gunu