Maganaamdlamu mammu mannimchavayya

మగనాండ్లము మమ్ము మన్నించవయ్య
Language

(॥పల్లవి॥)
మగనాండ్లము మమ్ము మన్నించవయ్య
అగడు సేయకువయ్య అప్పటిని మొక్కేము

(॥॥)
దొడ్డెఁడు పనులఁ గాచి దొరవు నేఁడైతివి
జడ్డు గొల్లెతలఁ బొంది జాణ వైతివి
జిడ్డంటీ నీ మేనెల్ల చీరలు మా కియ్యవయ్య
వొడ్డారపు శ్రీ కృష్ణుఁడని వొంటి చేత మొక్కేము

(॥॥)
పాలు వెన్నలు మెసఁగి పాయపువాఁడ వైతివి
రోలఁ గట్టించుక తొల్లె రూడి కెక్కితి
వోల నీపైఁ బడె మా వొడ్డాణా లీఁగదవయ్య
గేలిసేఁ తల కృష్ణుఁడ కిందుపడి మొక్కేము

(॥॥)
వోవల వలపు చల్లి వూరబాన వైతివి
కావించి మమ్ము నేలి మగఁడ వైతివి
పూవుల దండలు మావి పోఁడిమితో నియ్యవయ్య
శ్రీ వేంకటాద్రి కృష్ణుఁడ సిగ్గు తోడ మొక్కేమూ

(||pallavi||)
maganāṁḍlamu mammu manniṁchavayya
agaḍu seyaguvayya appaḍini mŏkkemu

(||||)
dŏḍḍĕm̐ḍu panulam̐ gāsi dŏravu nem̐ḍaidivi
jaḍḍu gŏllĕdalam̐ bŏṁdi jāṇa vaidivi
jiḍḍaṁṭī nī menĕlla sīralu mā kiyyavayya
vŏḍḍārabu śhrī kṛṣhṇum̐ḍani vŏṁṭi seda mŏkkemu

(||||)
pālu vĕnnalu mĕsam̐gi pāyabuvām̐ḍa vaidivi
rolam̐ gaṭṭiṁchuga tŏllĕ rūḍi kĕkkidi
vola nībaim̐ baḍĕ mā vŏḍḍāṇā līm̐gadavayya
gelisem̐ tala kṛṣhṇum̐ḍa kiṁdubaḍi mŏkkemu

(||||)
vovala valabu salli vūrabāna vaidivi
kāviṁchi mammu neli magam̐ḍa vaidivi
pūvula daṁḍalu māvi pom̐ḍimido niyyavayya
śhrī veṁkaḍādri kṛṣhṇum̐ḍa siggu toḍa mŏkkemū