మగఁడు త న్నొల్లకుంటే మరి మమ్మేల దూరీనే
(॥పల్లవి॥)
మగఁడు త న్నొల్లకుంటే మరి మమ్మేల దూరీనే
జిగి మీరైనా బుద్ధి చెప్పరే చెలులు
(॥॥)
చెలరేఁగి యందరితోఁ జెప్పుకొనే సుద్దులు
చలివాసి చల్లేటి సణఁగరాలు
పలుకుఁ బంతాలలోని పచ్చి వెచ్చి వెంగేలు
వెలయించీ నీకె చేత వింటిరటే చెలులు
(॥॥)
వుమ్మగిలుఁ జెమటతో నుడివోని జంకెనలు
సమ్మతించక వినేటి చండితనాలు
చిమ్ముఁ జూపుల తోడఁ జేతులు చాఁచే సన్నలు
సొమ్ముల మురిపెములుఁ జూడరే చెలులూ
(॥॥)
చీటికి మాటి కింతలో చీఁదరగొన్న మొక్కులు
కాటుక కన్నుల యీకె కాంతాళాలు
మేటి శ్రీ వేంకటేశుఁడు మిక్కిలి నన్నేలినది
తేట తెల్ల మాయ మీరు తెలియరే చెలులూ
(||pallavi||)
magam̐ḍu ta nnŏllaguṁṭe mari mammela dūrīne
jigi mīrainā buddhi sĕppare sĕlulu
(||||)
sĕlarem̐gi yaṁdaridom̐ jĕppugŏne suddulu
salivāsi salleḍi saṇam̐garālu
palugum̐ baṁtālaloni pachchi vĕchchi vĕṁgelu
vĕlayiṁchī nīgĕ seda viṁṭiraḍe sĕlulu
(||||)
vummagilum̐ jĕmaḍado nuḍivoni jaṁkĕnalu
sammadiṁchaga vineḍi saṁḍidanālu
simmum̐ jūbula toḍam̐ jedulu sām̐se sannalu
sŏmmula muribĕmulum̐ jūḍare sĕlulū
(||||)
sīḍigi māḍi kiṁtalo sīm̐daragŏnna mŏkkulu
kāḍuga kannula yīgĕ kāṁtāḽālu
meḍi śhrī veṁkaḍeśhum̐ḍu mikkili nannelinadi
teḍa tĕlla māya mīru tĕliyare sĕlulū