Magamdu seppina pani maguvagum jeyavale

మగఁడు చెప్పిన పని మగువకుఁ జేయవలె
Language

(॥పల్లవి॥)
మగఁడు చెప్పిన పని మగువకుఁ జేయవలె
తగవులన్నియు నేఁడు తలఁచుకో నీవే

(॥మగఁ॥)
ఇప్పుడేల లోఁగోవే యింతిఁ దోడుకరమ్మని
అప్పణగా నీవు నాతో నానతియ్యవా
చెప్పుట మరచితివో చింతతోఁ బరాకైతివో
తప్పులేదు నావల్ల తలఁచుకో నీవే

(॥మగఁ॥)
వెఱగులేల పడేవు విడె మాసె కిమ్మని
జఱసి కొలువులోన సన్నసేయవా
మరి దొరతనమో మగువల మొరఁగేవో
తఱి యఱఁగనా నేను తలఁచుకో నీవే

(॥మగఁ॥)
తెలుపుమనే వాకెఁ దెరవేయుమనెనని
వలుకఁగ సిగ్గుపడి భావించుకోవా
యిల నేలితివి మమ్ము నిద్దరి నీజాడలెట్టో
తలర శ్రీ వేంకటేశ తలఁచుకో నీవే

(||pallavi||)
magam̐ḍu sĕppina pani maguvagum̐ jeyavalĕ
tagavulanniyu nem̐ḍu talam̐sugo nīve

(||magam̐||)
ippuḍela lom̐gove yiṁtim̐ doḍugarammani
appaṇagā nīvu nādo nānadiyyavā
sĕppuḍa marasidivo siṁtadom̐ barāgaidivo
tappuledu nāvalla talam̐sugo nīve

(||magam̐||)
vĕṟagulela paḍevu viḍĕ māsĕ kimmani
jaṟasi kŏluvulona sannaseyavā
mari dŏradanamo maguvala mŏram̐gevo
taṟi yaṟam̐ganā nenu talam̐sugo nīve

(||magam̐||)
tĕlubumane vāgĕm̐ dĕraveyumanĕnani
valugam̐ga siggubaḍi bhāviṁchugovā
yila nelidivi mammu niddari nījāḍalĕṭṭo
talara śhrī veṁkaḍeśha talam̐sugo nīve