Magamdada aalada maamtalennainaa naadide

మగఁడట ఆలట మాఁటలెన్నైనా నాడితే
Language

(॥పల్లవి॥)
మగఁడట ఆలట మాఁటలెన్నైనా నాడితే
తగు తగదన నేలే తరుణులాలా

(॥॥)
పాయపువారికి నెల్లా పట్టపురాదు తమకము
ఆయాలు సోఁకఁ బతితో నాడకుందురా
చేయిమీఁదుగా నీతనిఁ జెనకెనంటా సతికి
నాయము లేమిచెప్పరే నాతులాలా

(॥॥)
వలచినవారికి వడియుచుండు మదము
బలిమి బ్రియునికొంగు పట్టకుందురా
పెలుచుఁదనాన నీకె పెనఁగెనంటా మీరు
పలుకనేలే సారికి పడఁతులాలా

(॥॥)
తతి గూడినవారికి దాఁచరాదు గర్వము
మితులు రతులలోన మీరకుందురా
ఇతవై శ్రీవేంకటేశునెద నీపె వున్నదంటా
కత లేమాడుకొనేరే కాంతలాలా

(||pallavi||)
magam̐ḍaḍa ālaḍa mām̐ṭalĕnnainā nāḍide
tagu tagadana nele taruṇulālā

(||||)
pāyabuvārigi nĕllā paṭṭaburādu tamagamu
āyālu som̐kam̐ badido nāḍaguṁdurā
seyimīm̐dugā nīdanim̐ jĕnagĕnaṁṭā sadigi
nāyamu lemisĕppare nādulālā

(||||)
valasinavārigi vaḍiyusuṁḍu madamu
balimi briyunigŏṁgu paṭṭaguṁdurā
pĕlusum̐danāna nīgĕ pĕnam̐gĕnaṁṭā mīru
paluganele sārigi paḍam̐tulālā

(||||)
tadi gūḍinavārigi dām̐sarādu garvamu
midulu radulalona mīraguṁdurā
idavai śhrīveṁkaḍeśhunĕda nībĕ vunnadaṁṭā
kada lemāḍugŏnere kāṁtalālā