మగఁడ వన్నిటి కోర్చి మన్నించరాదా
(॥పల్లవి॥)
మగఁడ వన్నిటి కోర్చి మన్నించరాదా
మగువలు సేసేవెల్లా మచ్చికలే కావా
(॥మగఁడ॥)
చనవు గలిగినట్టి సతి నిన్నుఁ గొసరితే
విని నవ్వవలెఁ గాక వేగిరింతురా
చెనకి యాపె నిన్నుఁ జేసిన చేఁతలెల్లా
ననుపులింతే కాక నలినెగసక్కెమా
(॥మగఁడ॥)
ఆసపడినయట్టి అంగన నిన్నంటితేను
సేసవెట్టవలెఁ గాక జీరదీతురా
వేసరక ఆపె నిన్ను వేఁడుకొమ్మనినదెల్లా
వాసులకింతేకాక వట్టి పంతమా
(॥మగఁడ॥)
కడు మోహించినయట్టికాంత నిన్నుఁ గూడితేను
వొడఁబడవలెఁ గాక వూరకుందురా
అడరి శ్రీవేంకటేశ ఆపె నిన్నుఁ బొందుటెల్ల
అడియాలాలకుఁ గాక ఆఱడిఁబెట్టుటకా
(||pallavi||)
magam̐ḍa vanniḍi korsi manniṁcharādā
maguvalu sesevĕllā machchigale kāvā
(||magam̐ḍa||)
sanavu galiginaṭṭi sadi ninnum̐ gŏsaride
vini navvavalĕm̐ gāga vegiriṁturā
sĕnagi yābĕ ninnum̐ jesina sem̐talĕllā
nanubuliṁte kāga nalinĕgasakkĕmā
(||magam̐ḍa||)
āsabaḍinayaṭṭi aṁgana ninnaṁṭidenu
sesavĕṭṭavalĕm̐ gāga jīradīdurā
vesaraga ābĕ ninnu vem̐ḍugŏmmaninadĕllā
vāsulagiṁtegāga vaṭṭi paṁtamā
(||magam̐ḍa||)
kaḍu mohiṁchinayaṭṭigāṁta ninnum̐ gūḍidenu
vŏḍam̐baḍavalĕm̐ gāga vūraguṁdurā
aḍari śhrīveṁkaḍeśha ābĕ ninnum̐ bŏṁduḍĕlla
aḍiyālālagum̐ gāga āṟaḍim̐bĕṭṭuḍagā