మదించిన యేనిగెకు మావటీఁడువంటి దాపె
(॥పల్లవి॥)
మదించిన యేనిగెకు మావటీఁడువంటి దాపె
సదరాన నిన్నిటు వసము చేసుకొనెను
(॥మదిం॥)
కప్పురానఁ గొనివేసి కామిని నిన్నిపు డిట్టే
చిప్పిలఁ దనమొకము చేసుకొనెను
ముప్పిరి నంతటిమీఁద ముంచి చేతులెత్తి మొక్కి
అప్పసము చుట్టముగా నటు సేసుకొనెను
(॥మదిం॥)
తొడమీఁదఁ గూచుండి తొయ్యలి చన్నుల నొత్తి
చిడుముడితోఁ గిందు సేసుకొనెను
జడిగొన మోవితేనె చవిచూపి నిన్నింతలో
కడలేక తనసొమ్ముగాఁ జేసుకొనెను
(॥మదిం॥)
సేస వెట్టి పెండ్లాడి చేరి నిన్నలమేల్మంగ
చేసూటి మగనిగాఁ జేసుకొనెను
ఆల శ్రీవేంకటేశ అన్నిటా నిన్నుఁగూడి
పోసరించి పాయరాని పొందు సేసుకొనెను
(||pallavi||)
madiṁchina yenigĕgu māvaḍīm̐ḍuvaṁṭi dābĕ
sadarāna ninniḍu vasamu sesugŏnĕnu
(||madiṁ||)
kappurānam̐ gŏnivesi kāmini ninnibu ḍiṭṭe
sippilam̐ danamŏgamu sesugŏnĕnu
muppiri naṁtaḍimīm̐da muṁchi sedulĕtti mŏkki
appasamu suṭṭamugā naḍu sesugŏnĕnu
(||madiṁ||)
tŏḍamīm̐dam̐ gūsuṁḍi tŏyyali sannula nŏtti
siḍumuḍidom̐ giṁdu sesugŏnĕnu
jaḍigŏna movidenĕ savisūbi ninniṁtalo
kaḍalega tanasŏmmugām̐ jesugŏnĕnu
(||madiṁ||)
sesa vĕṭṭi pĕṁḍlāḍi seri ninnalamelmaṁga
sesūḍi maganigām̐ jesugŏnĕnu
āla śhrīveṁkaḍeśha anniḍā ninnum̐gūḍi
posariṁchi pāyarāni pŏṁdu sesugŏnĕnu