Madimchina valabula matturaalanu

మదించిన వలపుల మత్తురాలను
Language

(॥పల్లవి॥)
మదించిన వలపుల మత్తురాలను
చెదర నీవే యింత సేసితివి నన్ను

(॥మదిం॥)
మాటలు నీ వాడించఁగ మఱచివుంటి నిందాఁకా
గాఁటానఁ జేయెత్తి మొక్కేఁ గైకొనవయ్యా
పాటించి నీవు రాఁగాను పై పైఁ జూడఁబట్టె నాకు
చాటువైనకానుకిచ్చే చాఁచవయ్యా చెయ్యీ

(॥మదిం॥)
సెలవి నీవు నవ్వఁగ సిగ్గుననుంటి నిందాఁకా
యెలమితో వీడెమిచ్చే నిందవయ్యా
నిలుచుండఁగా బానుపు నీకుఁ బరవఁగబట్టె
యెలమిఁ గైదండ ఇచ్చే నిందవయ్యా

(॥మదిం॥)
పైకొని కాఁగిలించంగ భ్రమసివుంటి నిందాఁకా
యీకడ మోవితేనియ లిందవయ్యా
దాకొని శ్రీవేంకటేశ దక్కితి విట్టె నాకు
రేకలఁ గస్తూరి గప్పే జోకై వుండరాదా

(||pallavi||)
madiṁchina valabula matturālanu
sĕdara nīve yiṁta sesidivi nannu

(||madiṁ||)
māḍalu nī vāḍiṁcham̐ga maṟasivuṁṭi niṁdām̐kā
gām̐ṭānam̐ jeyĕtti mŏkkem̐ gaigŏnavayyā
pāḍiṁchi nīvu rām̐gānu pai paim̐ jūḍam̐baṭṭĕ nāgu
sāḍuvainagānugichche sām̐savayyā sĕyyī

(||madiṁ||)
sĕlavi nīvu navvam̐ga siggunanuṁṭi niṁdām̐kā
yĕlamido vīḍĕmichche niṁdavayyā
nilusuṁḍam̐gā bānubu nīgum̐ baravam̐gabaṭṭĕ
yĕlamim̐ gaidaṁḍa ichche niṁdavayyā

(||madiṁ||)
paigŏni kām̐giliṁchaṁga bhramasivuṁṭi niṁdām̐kā
yīgaḍa movideniya liṁdavayyā
dāgŏni śhrīveṁkaḍeśha dakkidi viṭṭĕ nāgu
regalam̐ gastūri gappe jogai vuṁḍarādā