Maddagaa sinnegaa managu nemi baamti yimka

మద్దకా సిన్నెకా మనకు నేమి బాఁతి యింక
Language

(॥పల్లవి॥)
మద్దకా సిన్నెకా మనకు నేమి బాఁతి యింక
తిద్దుతీరు లేని దేవరటవే వీఁడు

(॥మద్ద॥)
గొల్లనందగోపుఁగారికొడుకు నేఁడు మనము చూడ
బొల్లి మోరగద్ద నెక్కి పోవునాఁ డదే
గుల్లసేతఁ బట్టి నుట్టికుదురువంటికత్తి వట్టి
తెల్లనల్లసూపువాఁడు దేవరటవే వీఁడు

(॥మద్ద॥)
పచ్చఁబూస అరతఁ గట్టి పసపువన్నె చీర గట్టి
పచ్చనలము నెత్తిఁ బెట్టి వచ్చువాఁ డదే
పచ్చిపాలు దాగ మరిగి పసుల గాసె నిన్నాళ్లు
దిచ్చరీఁడు వీడు మంచి దేవరటవే వీఁడూ

(॥మద్ద॥)
బిరుదు లెక్కి లక్కిమమ్మఁ బెండ్లి యాడి యేకతాన
వొరిమ శ్రీవేంకటాద్రి నుండువాడఁదే
వరము లెల్ల సారెఁ గన్నవారి కెల్ల నిచ్చి యిచ్చి
తిరముకొనెను బలిమితోడ దేవరటవె వీఁడు

(||pallavi||)
maddagā sinnĕgā managu nemi bām̐ti yiṁka
tiddudīru leni devaraḍave vīm̐ḍu

(||madda||)
gŏllanaṁdagobum̐gārigŏḍugu nem̐ḍu manamu sūḍa
bŏlli moragadda nĕkki povunām̐ ḍade
gullasedam̐ baṭṭi nuṭṭiguduruvaṁṭigatti vaṭṭi
tĕllanallasūbuvām̐ḍu devaraḍave vīm̐ḍu

(||madda||)
pachcham̐būsa aradam̐ gaṭṭi pasabuvannĕ sīra gaṭṭi
pachchanalamu nĕttim̐ bĕṭṭi vachchuvām̐ ḍade
pachchibālu dāga marigi pasula gāsĕ ninnāḽlu
dichcharīm̐ḍu vīḍu maṁchi devaraḍave vīm̐ḍū

(||madda||)
birudu lĕkki lakkimammam̐ bĕṁḍli yāḍi yegadāna
vŏrima śhrīveṁkaḍādri nuṁḍuvāḍam̐de
varamu lĕlla sārĕm̐ gannavāri kĕlla nichchi yichchi
tiramugŏnĕnu balimidoḍa devaraḍavĕ vīm̐ḍu