Madanaguruni mamchi majjanavela

మదనగురుని మంచి మజ్జనవేళ
Language

(॥పల్లవి॥)
మదనగురుని మంచి మజ్జనవేళ
పొదిగొన్న సింగారాల పోగాయ నితఁడు

(॥మదన॥)
తేరకొవ బంగారుబిందెల నించి పన్నీట
శ్రీరమణునకు నభిషేకము సేయగా
తోరమైన పూదేనెలతోడి యంజనాచలము
కారుకమ్మినటువలెఁ గనుపట్టె నిపుడు

(॥మదన॥)
కప్పురకాపుమేనఁ గలయఁగ మెత్తి మెత్తి
అప్పని కేకాంతాన నంగముల నించఁగాను
ముప్పిరి నేనుగకును ముత్యాలజల్లులనే
గుప్పె సింగారించినట్టు గుఱుతాయ నిపుడు

(॥మదన॥)
శ్రీవేంకటేశనకు చేరి యలమేల్మంగకు
ఆవటించి తట్టుపుణుఁ గన్నిటా నలఁదఁగాను
భావించఁ గల్పవృక్షముపై నీలమేఘములు
వేవేలుగా నిండినట్టి విధమాయ నిపుడు

(||pallavi||)
madanaguruni maṁchi majjanaveḽa
pŏdigŏnna siṁgārāla pogāya nidam̐ḍu

(||madana||)
teragŏva baṁgārubiṁdĕla niṁchi pannīḍa
śhrīramaṇunagu nabhiṣhegamu seyagā
toramaina pūdenĕladoḍi yaṁjanāsalamu
kārugamminaḍuvalĕm̐ ganubaṭṭĕ nibuḍu

(||madana||)
kappuragābumenam̐ galayam̐ga mĕtti mĕtti
appani kegāṁtāna naṁgamula niṁcham̐gānu
muppiri nenugagunu mutyālajallulane
guppĕ siṁgāriṁchinaṭṭu guṟudāya nibuḍu

(||madana||)
śhrīveṁkaḍeśhanagu seri yalamelmaṁgagu
āvaḍiṁchi taṭṭubuṇum̐ ganniḍā nalam̐dam̐gānu
bhāviṁcham̐ galbavṛkṣhamubai nīlameghamulu
vevelugā niṁḍinaṭṭi vidhamāya nibuḍu