Madamatsaramu lega manasubedai po

మదమత్సరము లేక మనసుపేదై పో
Language

(॥పల్లవి॥)
మదమత్సరము లేక మనసుపేదై పో
పదరిన యాసలవాఁడువో వైష్ణవుఁడు

(॥మద॥)
ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి
పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి
యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి
వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు

(॥మద॥)
గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి
నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి
వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల
వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు

(॥మద॥)
ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని
చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక
కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప
వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు

(||pallavi||)
madamatsaramu lega manasubedai po
padarina yāsalavām̐ḍuvo vaiṣhṇavum̐ḍu

(||mada||)
iṭṭunaṭṭum̐ dirigāḍi yemainā jĕḍanāḍi
pĕṭṭaraṁṭām̐ boyaraṁṭām̐ bĕkkulāḍi
yĕṭṭivārinainā dūri yĕvvarinainam̐ jeri
vaṭṭiyāsalam̐ baḍanivāḍum̐vo vaiṣhṇavum̐ḍu

(||mada||)
gaḍanagŏragum̐ jikki kāmugavidyalam̐ jŏkki
niḍivi nemainām̐ gani nikki nikki
vŏḍaliguṇamudoḍa vuduḍuvidyalam̐ jāla
vaḍadām̐ki baḍalanivām̐ḍuvo vaiṣhṇavum̐ḍu

(||mada||)
āvala vŏrulam̐ jĕḍanāḍam̐ga vinivini
sevamīri yĕvvarinim̐ jĕḍanāḍaga
kovidu śhrīveṁkaḍeśhum̐ gŏlisi pĕddalakṛpa
vāvivardanagalavāḍum̐vo vaiṣhṇavum̐ḍu