Madagaridanamulu maado nemidigi

మతకరితనములు మాతో నేమిటికి
Language

(॥పల్లవి॥)
మతకరితనములు మాతో నేమిటికి
తతి వచ్చినందుమీఁద దాఁచవచ్చునా

(॥మత॥)
నను నడుగనేఁటికి నంటున నీ సుద్దులు
మనసెఁగనికల్ల మరి వున్నదా
వెనకచుట్టరికము విచారించవచ్చేవు
తనవుసోఁకని యట్టి తగులాయ మున్నదా

(॥మత॥)
నేరుపుల నీమాటలు నేఁడు నాతో నెరపేవు
నోరెరఁగనియట్టి నుడువున్నదా
దారదప్ప నెవ్వెతెను దలఁచనని యాడేవు
కోరికెకులోనుగాని కూరి మున్నదా

(॥మత॥)
గిలిగించినా నీవు కేలిఁ బంతాలు చూపేవు
సెలవినవ్వుల రానిసిగ్గులున్నవా
నిలిచి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
కలసితివి నీవల్లఁ గడమున్నదా

(||pallavi||)
madagaridanamulu mādo nemiḍigi
tadi vachchinaṁdumīm̐da dām̐savachchunā

(||mada||)
nanu naḍuganem̐ṭigi naṁṭuna nī suddulu
manasĕm̐ganigalla mari vunnadā
vĕnagasuṭṭarigamu visāriṁchavachchevu
tanavusom̐kani yaṭṭi tagulāya munnadā

(||mada||)
nerubula nīmāḍalu nem̐ḍu nādo nĕrabevu
norĕram̐ganiyaṭṭi nuḍuvunnadā
dāradappa nĕvvĕdĕnu dalam̐sanani yāḍevu
korigĕgulonugāni kūri munnadā

(||mada||)
giligiṁchinā nīvu kelim̐ baṁtālu sūbevu
sĕlavinavvula rānisiggulunnavā
nilisi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
kalasidivi nīvallam̐ gaḍamunnadā