(॥పల్లవి॥)
మతకాలు నేరిచిన మాయదారివి
తతి నీ వడ్డము రాక తలరా వోరి
(॥మతకాలు॥)
దవ్వుల నే రాఁగానె తగఁ బలుకరించేవు
యెవ్వతెకు నా రాక యెచ్చరించేవో
అవ్వల నప్పటనుండి అనుమాన మయ్యీ నాకు
పవ్వళించే లోను చూచేఁ బదరా వోరి
(॥మతకాలు॥)
యింతట నేఁ జొచ్చి రాఁగా నెదురుగా వెళ్లి వచ్చే
వంత నాకె గోపగించీ నంటానో వోరి
యెంతైన నీవు నన్ను నేమరించఁ జోటు లేదు
చెంత నెవ్వతెఁ దెచ్చితి చెప్పరా వోరి
(॥మతకాలు॥)
చేరి నే మంచ మెక్కఁగా చెలులనే పిలిచేవు
వారిలో నాపెఁ గలుపేవగలా యివి
యేరా శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
తేరెఁ బను లింక తెర దియ్యరా వోరి
(||pallavi||)
madagālu nerisina māyadārivi
tadi nī vaḍḍamu rāga talarā vori
(||madagālu||)
davvula ne rām̐gānĕ tagam̐ balugariṁchevu
yĕvvadĕgu nā rāga yĕchchariṁchevo
avvala nappaḍanuṁḍi anumāna mayyī nāgu
pavvaḽiṁche lonu sūsem̐ badarā vori
(||madagālu||)
yiṁtaḍa nem̐ jŏchchi rām̐gā nĕdurugā vĕḽli vachche
vaṁta nāgĕ gobagiṁchī naṁṭāno vori
yĕṁtaina nīvu nannu nemariṁcham̐ joḍu ledu
sĕṁta nĕvvadĕm̐ dĕchchidi sĕpparā vori
(||madagālu||)
seri ne maṁcha mĕkkam̐gā sĕlulane pilisevu
vārilo nābĕm̐ galubevagalā yivi
yerā śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
terĕm̐ banu liṁka tĕra diyyarā vori