మచ్చికెంతగలిగినా మఱఁగు మొఱఁగులేదా
(॥పల్లవి॥)
మచ్చికెంతగలిగినా మఱఁగు మొఱఁగులేదా
ఇచ్చ యెరిఁగి లోలోనే యెనయుటగాక
(॥మచ్చి॥)
గుట్టుతోడ జవరాలు కుచములు దాఁచుకోఁగా
చుట్టమువలెనే తొంగిచూడవచ్చేవు
చిట్టకములు సేయఁగా సిబ్బితిగలయాఁటది
వొట్టువెట్టక మానునా వూరకె జంకించేవు
(॥మచ్చి॥)
వాసితోడ ముద్దరాలు వదనము వంచుకొంటే
సేసకొప్పు జారఁదీసి చెక్కునొక్కేవు
బేసబెల్లిచేఁతలకు పేరుకలపూవుఁబోణి
యాసడించవలదా నీవేల తమకించేవు
(॥మచ్చి॥)
వొజతోడ చదురాలు వోవరిలో నుండఁగాను
రాజసానఁ బచ్చిదేర రతిఁగూడేవు
తేజముతో మన్నించఁగా తేఁకువగల కోమలి
సాజవు శ్రీవేంకటేశ సంతోసించకుండునా
(||pallavi||)
machchigĕṁtagaliginā maṟam̐gu mŏṟam̐guledā
ichcha yĕrim̐gi lolone yĕnayuḍagāga
(||machchi||)
guṭṭudoḍa javarālu kusamulu dām̐sugom̐gā
suṭṭamuvalĕne tŏṁgisūḍavachchevu
siṭṭagamulu seyam̐gā sibbidigalayām̐ṭadi
vŏṭṭuvĕṭṭaga mānunā vūragĕ jaṁkiṁchevu
(||machchi||)
vāsidoḍa muddarālu vadanamu vaṁchugŏṁṭe
sesagŏppu jāram̐dīsi sĕkkunŏkkevu
besabĕllisem̐talagu perugalabūvum̐boṇi
yāsaḍiṁchavaladā nīvela tamagiṁchevu
(||machchi||)
vŏjadoḍa sadurālu vovarilo nuṁḍam̐gānu
rājasānam̐ bachchidera radim̐gūḍevu
tejamudo manniṁcham̐gā tem̐kuvagala komali
sājavu śhrīveṁkaḍeśha saṁtosiṁchaguṁḍunā