మచ్చికఁ బ్రపంచపుమరుపే బ్రహ్మానంద
(॥పల్లవి॥)
మచ్చికఁ బ్రపంచపుమరుపే బ్రహ్మానంద-
మిచ్చల తానే గురి ఇన్నిటికి నాత్మ
(॥మచ్చి॥)
లోచూపే వెలిఁబడి లోకమయి తోఁచీని
ఆచూపే మరలితే నది మోక్షము
యేచి రెంటికి నెడమధ్య మీమేను
తాచి వొకఁడే గురి తానాయ నాత్మ
(॥మచ్చి॥)
మన సొక్కచోట నుండి మాయలై తోఁచీని
మనసు తనందుంటే మహి యోగ్యము
వెనకమునుపులకు వీడుఁబట్టు జననము
కొనమొదలునుఁ దానే గురియాయ నాత్మ
(॥మచ్చి॥)
బయలు దునిసి బహుభానులై తోఁచీని
బయ లొక్కట యఖండపరిపూర్ణము
నయమై శ్రీవేంకటనాథు కరుణచేత
జయమై తానున్నచోనే సతమాయ నాత్మ
(||pallavi||)
machchigam̐ brabaṁchabumarube brahmānaṁda-
michchala tāne guri inniḍigi nātma
(||machchi||)
losūbe vĕlim̐baḍi logamayi tom̐sīni
āsūbe maralide nadi mokṣhamu
yesi rĕṁṭigi nĕḍamadhya mīmenu
tāsi vŏgam̐ḍe guri tānāya nātma
(||machchi||)
mana sŏkkasoḍa nuṁḍi māyalai tom̐sīni
manasu tanaṁduṁṭe mahi yogyamu
vĕnagamunubulagu vīḍum̐baṭṭu jananamu
kŏnamŏdalunum̐ dāne guriyāya nātma
(||machchi||)
bayalu dunisi bahubhānulai tom̐sīni
baya lŏkkaḍa yakhaṁḍabaribūrṇamu
nayamai śhrīveṁkaḍanāthu karuṇaseda
jayamai tānunnasone sadamāya nātma