Machchigala maṟabulagu madanabaadhala menu

మచ్చికల మఱపులకు మదనబాధల మేను
Language

(॥పల్లవి॥)
మచ్చికల మఱపులకు మదనబాధల మేను
వెచ్చినా నేమిటను విడువదీ బాధ

(॥మచ్చి॥)
తను వయో మదమునకుఁ దమకములచే బాధ
గొనకొన్న తమికి రతికోర్కి బాధ
అనుభవనరతికిఁ బాయని ప్రేమముల బాధ
ఘనకూటమికి వియోగములచే బాధ

(॥మచ్చి॥)
తఱి విరహ వేదనకు తలపోఁతచే బాధ
పఱచుఁదలఁపులకుఁ దాపముల బాధ
తఱచు తాపంబులకుఁ దడఁబాటుచే బాధ
పఱివోనినేర్పులకు పరవశము బాధ

(॥మచ్చి॥)
అలరు సింగారముల కలపుఁ జెమటల బాధ
చెలియ చెమటకుఁ దావిచేతి బాధ
కలికితనములకు వేంకటవిభుని రతిఁ గూడి
కొలఁదికిని మిగులు సిగ్గులచేత బాధ

(||pallavi||)
machchigala maṟabulagu madanabādhala menu
vĕchchinā nemiḍanu viḍuvadī bādha

(||machchi||)
tanu vayo madamunagum̐ damagamulase bādha
gŏnagŏnna tamigi radigorgi bādha
anubhavanaradigim̐ bāyani premamula bādha
ghanagūḍamigi viyogamulase bādha

(||machchi||)
taṟi viraha vedanagu talabom̐tase bādha
paṟasum̐dalam̐pulagum̐ dābamula bādha
taṟasu tābaṁbulagum̐ daḍam̐bāḍuse bādha
paṟivoninerbulagu paravaśhamu bādha

(||machchi||)
alaru siṁgāramula kalabum̐ jĕmaḍala bādha
sĕliya sĕmaḍagum̐ dāvisedi bādha
kaligidanamulagu veṁkaḍavibhuni radim̐ gūḍi
kŏlam̐digini migulu siggulaseda bādha