Machchigagala padivi mamchidayyeeni

మచ్చికగల పతివి మంచిదయ్యీని
Language

(॥పల్లవి॥)
మచ్చికగల పతివి మంచిదయ్యీని
ఇచ్చకము సేసుకొని యెనయరాదా

(॥మచ్చి॥)
చిగురుమోవతోడిచెలి మాటలాడితేను
వొనరై వుండక వేరే వుప్పనుండునా
యెగసక్కేలంటానేల యెగ్గుపట్టేవు
సగమందుఁ బంచదార చల్లుకోరాదా

(॥మచ్చి॥)
వసమై కెందామరలవంటికనుచూపులు
దెసల నెఱ్ఱనుండక తెల్లనుండినా
యెసఁగి కోపమంటాను యేల దూరేవు
పొసఁగఁ గప్రము గొంత పొదుపుకోరాదా

(॥మచ్చి॥)
సరుస కొండలనంటినచన్నులకాఁగిలి నీకు
ధర గట్లుగాక మెత్తన లయ్యీనా
యిరవై శ్రీవేంకటేశ యేలితి వింతలోనె
వురమునఁ బూదండ లొత్తుకోరాదా

(||pallavi||)
machchigagala padivi maṁchidayyīni
ichchagamu sesugŏni yĕnayarādā

(||machchi||)
sigurumovadoḍisĕli māḍalāḍidenu
vŏnarai vuṁḍaga vere vuppanuṁḍunā
yĕgasakkelaṁṭānela yĕggubaṭṭevu
sagamaṁdum̐ baṁchadāra sallugorādā

(||machchi||)
vasamai kĕṁdāmaralavaṁṭiganusūbulu
dĕsala nĕṭranuṁḍaga tĕllanuṁḍinā
yĕsam̐gi kobamaṁṭānu yela dūrevu
pŏsam̐gam̐ gapramu gŏṁta pŏdubugorādā

(||machchi||)
sarusa kŏṁḍalanaṁṭinasannulagām̐gili nīgu
dhara gaṭlugāga mĕttana layyīnā
yiravai śhrīveṁkaḍeśha yelidi viṁtalonĕ
vuramunam̐ būdaṁḍa lŏttugorādā