Machchigado nannum joosi mannimchemgaaga

మచ్చికతో నన్నుఁ జూచి మన్నించెఁగాక
Language

(॥పల్లవి॥)
మచ్చికతో నన్నుఁ జూచి మన్నించెఁగాక
ఇచ్చకురాలనైతి ఇఁక నాకుఁ దగునే

(॥మచ్చి॥)
చనువుగలవారికి సాదించినాఁ దగు
ననిచినవారికి జెనకఁదగును
యెనసినవారికి నేమిసేసినాఁదగు
ననుబోఁటివారికి నగఁదగునటవే

(॥మచ్చి॥)
చెలిమిగలవారికి చేరి పెనఁగఁగఁదగు
బలువుగలవారికి పైకొనఁదగు
కలసినవారికి కన్నుల జంకించఁదగు
అలవోక మాకెల్లా నంటఁదగవటవే

(॥మచ్చి॥)
వేడుకగలవారికే వేగిరించినాఁదగు
వాడికెగలవారికి వంతులుదగు
యీడనే శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేల
కూడి మావంటివారికి కొంకఁదగునటవే

(||pallavi||)
machchigado nannum̐ jūsi manniṁchĕm̐gāga
ichchagurālanaidi im̐ka nāgum̐ dagune

(||machchi||)
sanuvugalavārigi sādiṁchinām̐ dagu
nanisinavārigi jĕnagam̐dagunu
yĕnasinavārigi nemisesinām̐dagu
nanubom̐ṭivārigi nagam̐dagunaḍave

(||machchi||)
sĕlimigalavārigi seri pĕnam̐gam̐gam̐dagu
baluvugalavārigi paigŏnam̐dagu
kalasinavārigi kannula jaṁkiṁcham̐dagu
alavoga māgĕllā naṁṭam̐dagavaḍave

(||machchi||)
veḍugagalavārige vegiriṁchinām̐dagu
vāḍigĕgalavārigi vaṁtuludagu
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nela
kūḍi māvaṁṭivārigi kŏṁkam̐dagunaḍave