మచ్చి కెఱుఁగుదుఁ గాని మన సెఱుఁగ నన్ను
(॥పల్లవి॥)
మచ్చి కెఱుఁగుదుఁ గాని మన సెఱుఁగ నన్ను
మెచ్చు టెఱుఁగుదుఁ గాని మీఁదేమీ నెఱుఁగ
(॥మచ్చి॥)
కామించి పతిరూపే కను టెఱుఁగుదుఁ గాని
ఆమీఁదటిపను లవి యెఱుఁగా
నా మో మతఁడు చచి నవ్వు టెఱుఁగుదుఁ గాని
యేమని పలికెనో యేమియు నే నెఱుఁగ
(॥మచ్చి॥)
కదిసి నే నతని దగ్గరు టెఱుఁగుదుఁ గాని
నిదురో పరవశమో నే నెఱుఁగ
కొదలేక యతఁడు పైకొను టెఱుఁగుదుఁ గాని
యిది యది యని నే నేమియు నెఱుఁగ
(॥మచ్చి॥)
వన్నెల నామోవి చవిగొన్న దెఱుఁగుదుఁ గాని
యున్నువ చిలుకవోట్లవు టెఱుఁగ
వున్నతి కౌఁగిటఁ గూడి వుండు టెఱుఁగుదుఁ గాని
యెన్నఁడు శ్రీవేంకటేశు నెడసి నే నెఱుఁగ
(||pallavi||)
machchi kĕṟum̐gudum̐ gāni mana sĕṟum̐ga nannu
mĕchchu ṭĕṟum̐gudum̐ gāni mīm̐demī nĕṟum̐ga
(||machchi||)
kāmiṁchi padirūbe kanu ṭĕṟum̐gudum̐ gāni
āmīm̐daḍibanu lavi yĕṟum̐gā
nā mo madam̐ḍu sasi navvu ṭĕṟum̐gudum̐ gāni
yemani paligĕno yemiyu ne nĕṟum̐ga
(||machchi||)
kadisi ne nadani daggaru ṭĕṟum̐gudum̐ gāni
niduro paravaśhamo ne nĕṟum̐ga
kŏdalega yadam̐ḍu paigŏnu ṭĕṟum̐gudum̐ gāni
yidi yadi yani ne nemiyu nĕṟum̐ga
(||machchi||)
vannĕla nāmovi savigŏnna dĕṟum̐gudum̐ gāni
yunnuva silugavoṭlavu ṭĕṟum̐ga
vunnadi kaum̐giḍam̐ gūḍi vuṁḍu ṭĕṟum̐gudum̐ gāni
yĕnnam̐ḍu śhrīveṁkaḍeśhu nĕḍasi ne nĕṟum̐ga