Machcharimchi maabu daamkaa maamtalemtigi

మచ్చరించి మాపు దాఁకా మాఁటలేఁటికి
Language

(॥పల్లవి॥)
మచ్చరించి మాపు దాఁకా మాఁటలేఁటికి
రచ్చలఁ బెట్టక యిట్టె రావయ్య లోనికి

(॥మచ్చ॥)
వొత్తి నే విన్నవించఁగా వోజకు వచ్చేవా నీవు
చిత్తములోపలి మాట చెప్పితిఁగాక
తత్తరించి యంతలోనె తలవంచుకోనేల
కొత్తలు సేయక ఇంద కోవయ్య వీడెము

(॥మచ్చ॥)
మొక్కఁగ నిప్పుడే నాకు మునుకొని వలచవా
వెక్కసాన నీపై వొల వేసితిఁ గాక
చెక్కు చేతితో నిప్పుడు సిగ్గువడ నీకేల
పిక్కటిల్లెఁ దమకము పెట్టవయ్య సేసలు

(॥మచ్చ॥)
కొసరి నే నడుగఁగా గుట్టు నాకుఁ జెప్పేవా
యెసఁగి నా మనసు నీ కిచ్చితిఁ గాక
పొసఁగ శ్రీ వేంకటేశ పొందితివి నన్ను నేఁడు
అసురుసు రేఁటికి ఆఁపవయ్య వలపు

(||pallavi||)
machchariṁchi mābu dām̐kā mām̐ṭalem̐ṭigi
rachchalam̐ bĕṭṭaga yiṭṭĕ rāvayya lonigi

(||machcha||)
vŏtti ne vinnaviṁcham̐gā vojagu vachchevā nīvu
sittamulobali māḍa sĕppidim̐gāga
tattariṁchi yaṁtalonĕ talavaṁchugonela
kŏttalu seyaga iṁda kovayya vīḍĕmu

(||machcha||)
mŏkkam̐ga nippuḍe nāgu munugŏni valasavā
vĕkkasāna nībai vŏla vesidim̐ gāga
sĕkku sedido nippuḍu sigguvaḍa nīgela
pikkaḍillĕm̐ damagamu pĕṭṭavayya sesalu

(||machcha||)
kŏsari ne naḍugam̐gā guṭṭu nāgum̐ jĕppevā
yĕsam̐gi nā manasu nī kichchidim̐ gāga
pŏsam̐ga śhrī veṁkaḍeśha pŏṁdidivi nannu nem̐ḍu
asurusu rem̐ṭigi ām̐pavayya valabu