Maayimtigi raavoyi maadhavaa, nee

మాయింటికి రావోయి మాధవా, నీ
Language

(॥పల్లవి॥)
మాయింటికి రావోయి మాధవా, నీ
మాయలెల్లాఁ గంటి మిదె మాధవా

(॥మాయిం॥)
మచ్చు చల్లేవు వలపు మాధవా నేను
మచ్చిక లెల్లాఁ జేసితి మాధవా
మచ్చెము నీపై నిదె మాధవా యింక
మచ్చరపు చూపు నలో మాధవా

(॥మాయిం॥)
మఱుఁ గేల యింక నీకు మాధవా
మఱి నాకు దక్కితివి మాధవా
మఱచేవానిచేఁతలు మాధవా మాతో
మఱచు మాటే మనేవు మాధవా

(॥మాయిం॥)
మట్టులేని శ్రీవేంకట మాధవా కట్టు
మట్టుతో మమ్ముఁ గూడితి మాధవా
మట్టేవు మా కాళ్లప్పటి మాధవా
మట్టె లియ్యఁగద వోయి మాధవా

(||pallavi||)
māyiṁṭigi rāvoyi mādhavā, nī
māyalĕllām̐ gaṁṭi midĕ mādhavā

(||māyiṁ||)
machchu sallevu valabu mādhavā nenu
machchiga lĕllām̐ jesidi mādhavā
machchĕmu nībai nidĕ mādhavā yiṁka
machcharabu sūbu nalo mādhavā

(||māyiṁ||)
maṟum̐ gela yiṁka nīgu mādhavā
maṟi nāgu dakkidivi mādhavā
maṟasevānisem̐talu mādhavā mādo
maṟasu māḍe manevu mādhavā

(||māyiṁ||)
maṭṭuleni śhrīveṁkaḍa mādhavā kaṭṭu
maṭṭudo mammum̐ gūḍidi mādhavā
maṭṭevu mā kāḽlappaḍi mādhavā
maṭṭĕ liyyam̐gada voyi mādhavā