Maayamaanushamahima yidi

మాయమానుషమహిమ యిది
Language

(॥పల్లవి॥)
మాయమానుషమహిమ యిది
యేయెడ నీతఁడె యీశ్వరుఁడు

(॥మాయ॥)
మొదల యశోదకు ముద్దులబాలుఁడు
అదె మునులకుఁ బరమాత్ముఁడు
మది గోపికలకు మన్మథమన్మథుఁ
డెదుటనె తిరిగీ నీశ్వరుఁడు

(॥మాయ॥)
గోపబాలులకు గొల్లఁడు నాఁడే
చేపట్టెను లక్ష్మికి మగఁడు
కోపపుటసురలకు మృత్యు వీతఁడు
యేపున మెఱసీ నీశ్వరుఁడు

(॥మాయ॥)
పాండవులకుఁ దా బావయు మఱఁదియు
వొండొకవసుదేవునికొడుకు
అండనె శ్రీవేంకటాద్రికిఁ గృష్ణుఁడు
యిండుల ముంగిళ్ళ నీశ్వరుఁడు

(||pallavi||)
māyamānuṣhamahima yidi
yeyĕḍa nīdam̐ḍĕ yīśhvarum̐ḍu

(||māya||)
mŏdala yaśhodagu muddulabālum̐ḍu
adĕ munulagum̐ baramātmum̐ḍu
madi gobigalagu manmathamanmathum̐
ḍĕduḍanĕ tirigī nīśhvarum̐ḍu

(||māya||)
gobabālulagu gŏllam̐ḍu nām̐ḍe
sebaṭṭĕnu lakṣhmigi magam̐ḍu
kobabuḍasuralagu mṛtyu vīdam̐ḍu
yebuna mĕṟasī nīśhvarum̐ḍu

(||māya||)
pāṁḍavulagum̐ dā bāvayu maṟam̐diyu
vŏṁḍŏgavasudevunigŏḍugu
aṁḍanĕ śhrīveṁkaḍādrigim̐ gṛṣhṇum̐ḍu
yiṁḍula muṁgiḽḽa nīśhvarum̐ḍu