(॥పల్లవి॥)
మాయలు మాని నాతో మాటలాడరా
నాయడ మునిముచ్చుఁ దన మేల నీకు
(॥మాయలు॥)
ఆరయ నాకెవంతూ ననేవు నీ వప్పటిని
నేరుపున నాపెమోము నేఁడు చూడవా
కేరి కేరి నవ్వేవు కేఁగండ్లఁ జూచుకొంటా
యేరా లే దటరా యీ మాట నీవు
(॥మాయలు॥)
బత్తి నాకు గల నంటాఁ బాయవు నీ వాపెకు
హత్తిన చెలిచేఁ జెప్పి యంప వామాఁటా
వత్తివలెఁ బైఁ బడేవు వట్టి చనవు సేసుక
ఉత్తర మీరా యిందు కూరకుండేఁ గాని
(॥మాయలు॥)
యేపున నన్నే కాని యెవ్వరి నొల్లననేవు
ఆపె సొమ్ములె కావా అట్టె నీమేన
రాపుగా శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
ఆపను లిన్నాళ్లదాఁకా నమరెఁ గా నీకు
(||pallavi||)
māyalu māni nādo māḍalāḍarā
nāyaḍa munimuchchum̐ dana mela nīgu
(||māyalu||)
āraya nāgĕvaṁtū nanevu nī vappaḍini
nerubuna nābĕmomu nem̐ḍu sūḍavā
keri keri navvevu kem̐gaṁḍlam̐ jūsugŏṁṭā
yerā le daḍarā yī māḍa nīvu
(||māyalu||)
batti nāgu gala naṁṭām̐ bāyavu nī vābĕgu
hattina sĕlisem̐ jĕppi yaṁpa vāmām̐ṭā
vattivalĕm̐ baim̐ baḍevu vaṭṭi sanavu sesuga
uttara mīrā yiṁdu kūraguṁḍem̐ gāni
(||māyalu||)
yebuna nanne kāni yĕvvari nŏllananevu
ābĕ sŏmmulĕ kāvā aṭṭĕ nīmena
rābugā śhrīvĕṁkaḍeśha radi nannum̐ gūḍidivi
ābanu linnāḽladām̐kā namarĕm̐ gā nīgu