Maayalom badi maa paadu maṟasidi memtayunu

మాయలోఁ బడి మా పాటు మఱచితి మెంతయును
Language

(॥పల్లవి॥)
మాయలోఁ బడి మా పాటు మఱచితి మెంతయును
పోయినది మాకుఁ దెచ్చి పోగు సేయఁగలరా

(॥వయ॥)
మెట్టైన కిందెడు మీఁదెడు లోకములాల
యిట్టే నా జన్మము లెన్ని యెఱుఁగుదురా
చట్టెడు జలధులాల సప్త మారుతములాల
వొట్టి నా కర్మఫలము లున్నవా మీచేతను

(॥వయ॥)
నడచే యుగములాల నానాదేవతలాల
చెడని నా భక్తియేదో చెప్పగలరా
జడియని దిక్కులాల సరిఁగులగిరులాల
విడిదల నాపట్లు వివరించఁ గలరా

(॥వయ॥)
వెలసిన మునులాల వేదశాస్త్రములాల
సొలసి నాలోని హరినిఁ జూఁపగలరా
యెలమి శ్రీవేంకటేశుఁ డెదుట నున్నాఁడు వీఁడే
తెలిపి మన్నించఁగాను తేటతెల్ల మాయను

(||pallavi||)
māyalom̐ baḍi mā pāḍu maṟasidi mĕṁtayunu
poyinadi māgum̐ dĕchchi pogu seyam̐galarā

(||vaya||)
mĕṭṭaina kiṁdĕḍu mīm̐dĕḍu logamulāla
yiṭṭe nā janmamu lĕnni yĕṟum̐gudurā
saṭṭĕḍu jaladhulāla sapta mārudamulāla
vŏṭṭi nā karmaphalamu lunnavā mīsedanu

(||vaya||)
naḍase yugamulāla nānādevadalāla
sĕḍani nā bhaktiyedo sĕppagalarā
jaḍiyani dikkulāla sarim̐gulagirulāla
viḍidala nābaṭlu vivariṁcham̐ galarā

(||vaya||)
vĕlasina munulāla vedaśhāstramulāla
sŏlasi nāloni harinim̐ jūm̐pagalarā
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍĕduḍa nunnām̐ḍu vīm̐ḍe
tĕlibi manniṁcham̐gānu teḍadĕlla māyanu