Maayalela soobevu maa mumdarane

మాయలేల చూపేవు మా ముందరనే
Language

(॥పల్లవి॥)
మాయలేల చూపేవు మా ముందరనే
నీ యింపు లివియెల్లా నేనెరఁగనా

(॥మాయ॥)
వేడుకకు నాపె నీపై వెలగొని మీటితేను
పాడిపంతా లింతలోనే పచారించేవు
యీడ మాముందర గాగా యెగ్గులువట్టేవుగాక
కూడి యేకతాననైతే కోపగించగలవా

(॥మాయ॥)
నవ్వుతా నప్పటి నాపె నంటున జంకించితేను
ఇవ్వల వాసులెంచేవు ఇప్పుడే నీవు
యెవ్వరైనా నాడేరంటా యేటికో లోగేవు గాక
పవ్వళించేపానుపుపై పట్టి పెనగేవా

(॥మాయ॥)
వలచినయాపై నిన్ను వడిఁ గాఁగిలించితేను
కలసితివి నన్నిట్టె కాతరానను
నిలిచి శ్రీవేంకటేశ నే నలమేలు మంగను
చెలఁగే విట్లా నందూఁ జిత్తగించమెచ్చేవా

(||pallavi||)
māyalela sūbevu mā muṁdarane
nī yiṁpu liviyĕllā nenĕram̐ganā

(||māya||)
veḍugagu nābĕ nībai vĕlagŏni mīḍidenu
pāḍibaṁtā liṁtalone pasāriṁchevu
yīḍa māmuṁdara gāgā yĕgguluvaṭṭevugāga
kūḍi yegadānanaide kobagiṁchagalavā

(||māya||)
navvudā nappaḍi nābĕ naṁṭuna jaṁkiṁchidenu
ivvala vāsulĕṁchevu ippuḍe nīvu
yĕvvarainā nāḍeraṁṭā yeḍigo logevu gāga
pavvaḽiṁchebānububai paṭṭi pĕnagevā

(||māya||)
valasinayābai ninnu vaḍim̐ gām̐giliṁchidenu
kalasidivi nanniṭṭĕ kādarānanu
nilisi śhrīveṁkaḍeśha ne nalamelu maṁganu
sĕlam̐ge viṭlā naṁdūm̐ jittagiṁchamĕchchevā