మాయలేల సేసేవు మన్నించరాదా
(॥పల్లవి॥)
మాయలేల సేసేవు మన్నించరాదా
బాయిటఁ బడె నీగుట్టు ప్రహ్లాదవరద
(॥॥)
వొరసివలపు తొల్లే వొడిఁ గట్టుకొన్నందుకు
అరుదైనతొడపై తొయ్యలి సాకిరి
సరుసనే మాతోను జాణతనాలాడేవు
యిరవై నీయాసోద మేమిచెప్పే దిఁకను
(॥॥)
మొనసి చుట్టరికము తొల్లి మోపు గట్టుకొన్నందుకు
యెనలేని వీఁపుమీఁది యింతి సాకిరి
ననుపు నాతోనే నవ్వులెల్లా నవ్వేవు
నినుపులై గజరెల్లా నిండె నీమైనిపుడు
(॥॥)
తమకమెల్లాఁ దవ్వి తలకెత్తుకున్నందుకు
కొమరైనశిరసుపై కొమ్మ సాకిరి
మమత శ్రీవేంకటేశ మరిగి నన్నేలితివి
జమళినీపొందులు సతమాయ నేఁడు
(||pallavi||)
māyalela sesevu manniṁcharādā
bāyiḍam̐ baḍĕ nīguṭṭu prahlādavarada
(||||)
vŏrasivalabu tŏlle vŏḍim̐ gaṭṭugŏnnaṁdugu
arudainadŏḍabai tŏyyali sāgiri
sarusane mādonu jāṇadanālāḍevu
yiravai nīyāsoda memisĕppe dim̐kanu
(||||)
mŏnasi suṭṭarigamu tŏlli mobu gaṭṭugŏnnaṁdugu
yĕnaleni vīm̐pumīm̐di yiṁti sāgiri
nanubu nādone navvulĕllā navvevu
ninubulai gajarĕllā niṁḍĕ nīmainibuḍu
(||||)
tamagamĕllām̐ davvi talagĕttugunnaṁdugu
kŏmarainaśhirasubai kŏmma sāgiri
mamada śhrīveṁkaḍeśha marigi nannelidivi
jamaḽinībŏṁdulu sadamāya nem̐ḍu