Maayala kagabadi madi sedi praanulu

మాయల కగపడి మతి చెడి ప్రాణులు
Language

(॥పల్లవి॥)
మాయల కగపడి మతి చెడి ప్రాణులు
రోయఁ దలఁచియును రోయఁగ లేరు

(॥వయ॥)
మిస మిస మెరువఁగ మెల్లన చేరిరి
ముసిఁడిమాని ఫలములు చూచి
రసమని సంసారపు బాలికులిదె
విసిగి చేఁదుగని విరుగఁగలేరు

(॥వయ॥)
బలు విష మొలికెడి పాముఁ బట్టుకొని
అలరుచు నలుగడ నాడేరు
పొలసి యాసలూర్పులు నిగుడించఁగ
తెలిసియు నింకాఁ దెలియఁగలేరు

(॥వయ॥)
తేనెదెచ్చి కత్తికి దారఁ బెట్టి(న)
నానా విధముల నాఁకేరు
దీన తలణఁపెడి తిరు వేంకటపతి
చేని పంటలకుఁ జెయి చాఁచలేదు

(||pallavi||)
māyala kagabaḍi madi sĕḍi prāṇulu
royam̐ dalam̐siyunu royam̐ga leru

(||vaya||)
misa misa mĕruvam̐ga mĕllana seriri
musim̐ḍimāni phalamulu sūsi
rasamani saṁsārabu bāligulidĕ
visigi sem̐dugani virugam̐galeru

(||vaya||)
balu viṣha mŏligĕḍi pāmum̐ baṭṭugŏni
alarusu nalugaḍa nāḍeru
pŏlasi yāsalūrbulu niguḍiṁcham̐ga
tĕlisiyu niṁkām̐ dĕliyam̐galeru

(||vaya||)
tenĕdĕchchi kattigi dāram̐ bĕṭṭi(na)
nānā vidhamula nām̐keru
dīna talaṇam̐pĕḍi tiru veṁkaḍabadi
seni paṁṭalagum̐ jĕyi sām̐saledu